లండన్ వీధుల్లో మెగా ఫ్యాన్స్ కోలాహలం.. 'పెద్ది' విజయోత్సవంలో చరణ్‌కు అభిమానుల నీరాజనం.. ఇదిగో వీడియో!
- లండన్‌లో 'పెద్ది' చిత్ర విజయోత్సవ వేడుకలు
- సెలబ్రేషన్స్‌లో పాల్గొనేందుకు లండన్ వెళ్లిన రామ్ చరణ్
- ఎయిర్‌పోర్ట్‌లో హీరోకు బ్రహ్మరథం పట్టిన అభిమానులు
- హన్స్‌లోని సినీవరల్డ్ థియేటర్లో ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్‌లో పాల్గొన్న చెర్రీ
స్టైలిష్ సూట్, కళ్లద్దాలతో లండన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన చరణ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌ల కోసం పోటీపడ్డారు. అనంతరం లండన్‌లోని హన్స్లో ఉన్న ప్రసిద్ధ సినీవరల్డ్ థియేటర్లో జరిగిన ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ అభిమానులతో కలిసి సినిమా చూస్తూ సందడి చేశారు. వారి ఆనందాన్ని దగ్గరుండి పంచుకున్నారు. ‘పెద్ది’ చిత్రానికి యూకేలో లభించిన ఆదరణకు కృతజ్ఞత తెలిపేందుకే ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఈ నెల 4న విడుదలైన ఈ సినిమా, మొదట్లో మిశ్రమ స్పందన తెచ్చుకున్నా... ఆ తర్వాత మౌత్ టాక్‌తో అద్భుత విజయం సాధించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించిన అనంతరం, ఓవర్సీస్ అభిమానుల కోసం లండన్‌లో ఈ వేడుకను ప్లాన్ చేశారు. థియేట్రికల్ రన్ ముగిశాక, త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం లండన్ వీధుల్లో, థియేటర్ వద్ద రామ్ చరణ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానుల కోలాహలం మధ్య 'పెద్ది' సక్సెస్‌ను రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.