భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలి: జగన్

YS Jagan Mohan Reddy pays tribute to legendary filmmaker K Bhagyaraj
  • గుండెపోటుతో మృతి చెందిన దర్శకనటుడు భాగ్యరాజ్
  • సినీ రంగంపై భాగ్యరాజ్ చెరగని ముద్ర వేశారన్న జగన్
  • సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని వ్యాఖ్య
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ మృతిపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ సంతాపం వ్యక్తం చేశారు. జగన్ తన సంతాప సందేశంలో... “రచయితగా, సహాయ నటుడిగా సినీ జీవితం ప్రారంభించిన భాగ్యరాజ్ తన అసాధారణ ప్రతిభతో తమిళ సినిమా పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. భారతీయ సినిమా రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారు” అని పేర్కొన్నారు. 

ఆయన దర్శకత్వం వహించిన, కథ-స్క్రీన్‌ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఘన విజయాలు సాధించాయని గుర్తు చేశారు. 

ప్రేమ, కుటుంబ బంధాలు, మానవీయ విలువలను తన సినిమాల్లో ఆవిష్కరించిన భాగ్యరాజ్ సినీ రంగానికి చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని జగన్ అన్నారు. “భాగ్యరాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సినీ పరిశ్రమకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని తన సందేశంలో పేర్కొన్నారు.

YS Jagan Mohan Reddy
K Bhagyaraj
Bhagyaraj death
Tamil cinema director
YSRCP Chief condolences
Indian film industry

More Telugu News