పాక్‌లో మళ్లీ భూకంపం.. గంటల వ్యవధిలో రెండోసారి భూప్రకంపనలు
- ఇవాళ పాకిస్థాన్‌లో 5.4 తీవ్రతతో భూకంపం
- గంటల వ్యవధిలోనే రెండోసారి కంపించిన భూమి
- నిన్న సాయంత్రం కూడా 5.3 తీవ్రతతో భూప్రకంపనలు
- వెనెజువెలా భూకంప విలయంలో 920కి చేరిన మృతుల సంఖ్య
ఇదిలా ఉంటే.. వెనెజువెలాలో సంభవించిన భూకంప విలయం పెను విషాదాన్ని మిగిల్చింది. రెండు రోజుల క్రితం 7.2, 7.5 తీవ్రతతో వచ్చిన భారీ జంట భూకంపాల తర్వాత నిన్న మరోసారి 4.9 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకృతి వైపరీత్యం ధాటికి మృతుల సంఖ్య 920కి చేరినట్లు అధికారులు ధ్రువీకరించారు. మరో 3,360 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ భూకంపాల వల్ల రాజధాని కారకాస్‌తో పాటు పలు నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. సుమారు 50,000 మందికి పైగా ప్రజలు గల్లంతైనట్లు సమాచారం. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 871 మంది అంతర్జాతీయ నిపుణులతో కూడిన బృందాలు ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.