ఐర్లాండ్‌తో తొలి టీ20: భారత్ ముందు 183 పరుగుల లక్ష్యం
- ఐర్లాండ్‌తో తొలి టీ20
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసిన ఐర్లాండ్
- రాణించిన కెప్టెన్ టకర్, డెలానీ
- హర్షిత్ రాణాకు 3 వికెట్లు
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. భారత యువ పేసర్ హర్షిత్ రాణా తన అద్భుత బౌలింగ్‌తో ఐర్లాండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. కేవలం 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలోకెప్టెన్ టకర్, డెలానీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. టక్కర్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, డెలానీ 32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 పరుగులు చేసి త్రుటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యం వల్లే ఐర్లాండ్ భారీ స్కోరు సాధించగలిగింది.
భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4 ఓవర్లలో కేవలం 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. అయితే, ప్రసిద్ధ్ కృష్ణ తన 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకొన్నాడు.