'ధురంధర్' సీన్లతో ఐఐఎం క్లాసులో ప్రొఫెసర్ పాఠాలు... వీడియో వైరల్
- ఐఐఎం అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ వినూత్న బోధన
- ‘ధురంధర్’ సినిమాతో స్టాటిస్టిక్స్ పాఠాలు
- క్లస్టర్ శాంప్లింగ్, స్ట్రాటిఫికేషన్ కాన్సెప్ట్‌లను వివరించిన ప్రొఫెసర్
- సోషల్ మీడియాలో వైరల్ అయిన క్లాస్రూమ్ వీడియో
- ప్రొఫెసర్ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసలు
ఐఐఎం-ఎ విద్యార్థి ప్రఖర్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. క్లాస్‌రూమ్‌లో ప్రొఫెసర్, రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ సినిమాలోని ఓ క్లిప్‌ను ప్రొజెక్టర్‌పై ప్లే చేసి, రీసెర్చ్ మెథడాలజీలోని కీలక కాన్సెప్ట్‌లను వివరించారు. ఈ వీడియోకు ప్రఖర్ సింగ్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జతచేశాడు. "ధురంధర్ సినిమా స్టాటిస్టిక్స్ పాఠంగా మారడం ఐఐఎం అహ్మదాబాద్‌లో మాత్రమే సాధ్యం. ‘ల్యారీని గెలిస్తే, పాకిస్థాన్‌ను గెలిచినట్టే’ అనే డైలాగ్‌ను ‘క్లస్టర్ శాంప్లింగ్’కు, ‘బలూచ్ గ్యాంగ్‌లు, పఠాన్ గ్యాంగ్‌లు వేర్వేరు గ్రూపులు’ అనే దాన్ని ‘స్ట్రాటిఫికేషన్’కు ఉదాహరణగా చెప్పారు" అని పేర్కొన్నాడు.
పాకిస్థాన్ లోని గ్యాంగ్ వార్స్, భారత టెర్రర్ ఆపరేషన్ల నేపథ్యంలో తెరకెక్కిన స్పై-థ్రిల్లర్ ‘ధురంధర్’. ఈ సినిమా డైలాగులను ఉపయోగించి క్లిష్టమైన విషయాలను విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పిన ప్రొఫెసర్ క్రియేటివిటీని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. సంక్లిష్టమైన అంశాలను నేర్పించడానికి ఇదొక అద్భుతమైన మార్గమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.