విధానాలను విమర్శించండి.. వ్యక్తులను కాదు.. అమర్నాథ్‌కు పవన్‌ కల్యాణ్‌ క్లాస్‌!

Pawan Kalyan slams Gudivada Amarnath for personal comments on Vangalapudi Anitha
  • ‘మేకప్‌ మంత్రి’ అంటూ హోంమంత్రి అనితపై అమర్నాథ్‌ వ్యాఖ్యలు
  • మహిళల దుస్తులు, రూపంపై వ్యాఖ్యలు అవమానకరమన్న పవన్‌
  • రాజకీయ విమర్శలు విధానాలపై మాత్రమే ఉండాలని సూచన
  • కూటమి నేతలు సంయమనంతో స్పందించాలని హితవు
ఆంధ్రప్రదేశ్‌ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ చేసిన ‘మేకప్‌’ వ్యాఖ్యలను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా ఖండించారు. మహిళల దుస్తులు, రూపురేఖలపై వ్యాఖ్యానించడం వారిని అవమానపరచడమేనని స్పష్టం చేశారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలే తప్ప వ్యక్తిగత అంశాలపై కాదన్నారు.

సోషల్‌ మీడియా వేదికగా స్పందించిన పవన్‌ కల్యాణ్‌ మహిళల గురించి మాట్లాడేటప్పుడు ప్రజాప్రతినిధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనితను లక్ష్యంగా చేసుకున్న వ్యాఖ్యలు మహిళలందరినీ కించపరిచినట్లేనని పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్నవారి మాటలను సమాజం నిశితంగా గమనిస్తుందని గుర్తు చేశారు.

రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని, అయితే అవి విధానాలకు మాత్రమే పరిమితం కావాలని పవన్‌ అన్నారు. ఏదైనా విధానం నచ్చకపోతే దానిపై విమర్శలు చేయాలని, వ్యక్తిగత దూషణలు సరైన పద్ధతి కాదని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతల వ్యాఖ్యలు రాజకీయ సంస్కృతికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.

అలాగే అధికార కూటమి నేతలకు కూడా పవన్‌ సూచనలు చేశారు. ప్రతిపక్షాల వ్యాఖ్యలకు స్పందించే సమయంలో సంయమనంతో వ్యవహరించాలని, అసభ్య భాషకు తావివ్వకుండా ప్రజలు మెచ్చే రీతిలో గట్టిగా బదులివ్వాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీ ఉపయోగించే భాషను కూటమి నేతలు అనుసరించాల్సిన అవసరం లేదన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Gudivada Amarnath
Vangalapudi Anitha
Andhra Pradesh politics
Political ethics
Women dignity

More Telugu News