ఏపీకి వర్ష సూచన.. పలు జిల్లాలకు హెచ్చరిక
- దక్షిణ కోస్తాంధ్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించిన అల్పపీడనం
- ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన జారీ
- కొన్ని జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు
- మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన
మన్యం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అదేవిధంగా శ్రీకాకుళం, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, బాపట్ల, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని వివరించారు.
వర్షాలు, పిడుగులతో కూడిన ఉరుముల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, భారీ హోర్డింగుల సమీపంలో నిలబడటం సురక్షితం కాదని హెచ్చరించారు.