అమ్మే ఫస్ట్.. క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

Andhra
Advertisement
  • ప్రెస్ మీట్ మధ్యలో తల్లి ఫోన్ లిఫ్ట్ చేసిన క్రికెటర్ నితీశ్ రెడ్డి
  • మరలా కాల్ చేస్తాను అమ్మా అంటూ మీడియా సమావేశం కొనసాగింపు
  • ఆటైనా, ప్రెస్ మీటైనా అమ్మే ఫస్ట్ అంటూ నితీశ్‌పై లోకేశ్ ప్రశంస
  • ఏపీ క్రికెటర్ సంస్కారానికి ముగ్ధుడైనట్లు తెలిపిన మంత్రి
  • తొలి వన్డేలో 2 వికెట్లు పడగొట్టిన నితీశ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Advertisement
టీమిండియా యువ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డిపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రెస్ కాన్ఫరెన్స్ వంటి కీలకమైన సందర్భంలోనూ తన తల్లికి నితీశ్ ఇచ్చిన గౌరవాన్ని మెచ్చుకుంటూ లోకేశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే, ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించి, సెంచరీ హీరో రహ్మనుల్లా గుర్బాజ్‌తో సహా 2 కీలక వికెట్లు పడగొట్టాడు. మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతుండగా ఫోన్ మోగింది. అది తన తల్లి నుంచి వచ్చిన కాల్ అని గమనించిన నితీశ్, మీడియాకు క్షమాపణ చెప్పి, "అమ్మా, నేను మళ్లీ కాల్ చేస్తాను" అని సున్నితంగా చెప్పి ఫోన్ పెట్టేశారు. అనంతరం ప్రెస్ మీట్‌ను కొనసాగించారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై మంత్రి నారా లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. "క్రికెట్ అయినా, ప్రెస్ కాన్ఫరెన్స్ అయినా.. అమ్మే ఫస్ట్. వెల్ ప్లేయడ్, నితీశ్!" అని పేర్కొంటూ ఆ వీడియోను ఆయన పంచుకున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, తల్లి పట్ల నితీశ్ చూపిన గౌరవం, సంస్కారం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటతోనే కాకుండా, తన ప్రవర్తనతో కూడా నితీశ్ అభిమానుల మనసులను గెలుచుకుంటున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Nitish Kumar ReddyNara LokeshAndhra PradeshIndian Cricket TeamAmma FirstPress Conference

More Telugu News

న్యూజిలాండ్ వీధుల్లో సామాన్యుల్లా భారత క్రికెటర్లు.. వీడియో వైరల్!

02 Nov, 13:46

రోహిత్‌ వర్సెస్‌ కోహ్లీ: ఎవరు సెంచరీ చేస్తారు? పుజారా అంచనా ఇదే..!

02 Nov, 13:45

పాకిస్థాన్‌ విదేశాంగ విధానాన్ని నడిపించేది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పేసిన మంత్రి ఖవాజా

02 Nov, 13:37

అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. విమర్శకులకు రెహమాన్‌ సమాధానం!

02 Nov, 13:23

క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో పరుగులు తీసిన రోగులు.. ఇదిగో వీడియో!

02 Nov, 13:22

రూ.800 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్ 2'.. కోలీవుడ్‌లో రజనీకాంత్ సరికొత్త రికార్డ్!

02 Nov, 13:08

ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు వస్తుంది?

02 Nov, 12:50

పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

02 Nov, 12:43

61 ఏళ్లలోనూ అదే ఫిట్‌నెస్.. షారుక్ ఖాన్ సీక్రెట్ ఇదే!

02 Nov, 12:38

ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ. 11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

02 Nov, 12:26

ఏఐకి భౌతిక రూపం.. 'మ్యాక్స్' హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన మెటా!

02 Nov, 12:17

రాప్తాడు దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ కీలక అప్‌డేట్‌

02 Nov, 12:16

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48
..More Telugu News