రహ్మనుల్లా గుర్బాజ్ ఫాస్టెస్ట్ సెంచరీ... టీమిండియా ముందు భారీ టార్గెట్

Sports
Advertisement
  • వర్షం వల్ల 25 ఓవర్లకు తొలి వన్డే కుదింపు
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
  • 51 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్ లతో 102 పరుగులు చేసిన గుర్బాజ్
  • ఆఫ్ఘన్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ
Advertisement
భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ (102) విధ్వంసక సెంచరీతో చెలరేగినా, భారత బౌలర్లు సమష్టిగా రాణించి ఆఫ్ఘన్ ఇన్నింగ్స్‌కు త్వరగా ముగింపు పలికారు. ధర్మశాల వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, ఈ మ్యాచ్ ను వర్షం వల్ల 25 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. 

తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్థాన్‌కు పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, ఈ దశలో క్రీజులో నిలిచిన గుర్బాజ్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. వ్యక్తిగత స్కోరు 14 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూ అప్పీల్ నుంచి అదృష్టవశాత్తూ తప్పించుకున్న గుర్బాజ్, ఆ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కేవలం 48 బంతుల్లోనే తన 9వ వన్డే సెంచరీ పూర్తి చేసి, ఆఫ్ఘనిస్థాన్ తరఫున అత్యంత వేగవంతమైన శతకాన్ని నమోదు చేశాడు. భారత్‌పై వన్డేల్లో ఇది రెండో వేగవంతమైన సెంచరీ కావడం విశేషం.

గుర్బాజ్ ధాటికి ప్రసిద్ధ్ కృష్ణ, హర్ష్ దూబే, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఒక దశలో ఆఫ్ఘనిస్థాన్ స్కోరు 220 దాటుతుందనిపించింది. అయితే, గుర్బాజ్ ఔటైన తర్వాత స్కోరు వేగం తగ్గింది. ఆఫ్ఘన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది (27), అజ్మతుల్లా ఒమర్జాయ్ (26) తప్ప మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.

ఆరంభంలో భారీగా పరుగులు ఇచ్చినప్పటికీ, భారత బౌలర్లు చివర్లో అద్భుతంగా పుంజుకున్నారు. గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే చెరో 3 వికెట్లు పడగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీసి వారికి సహకరించారు. గుర్బాజ్ సెంచరీతో భయపెట్టినా, భారత బౌలర్లు సకాలంలో పుంజుకోవడంతో ఆఫ్ఘనిస్తాన్ 200 పరుగుల లోపే పరిమితమైంది. 
Advertisement

సంబంధిత వార్తలు

Rahmanullah GurbazIndia vs Afghanistan ODIGurbaz fastest centuryDharamshala Cricket StadiumGurnoor BrarHarsh Dubey

More Telugu News

న్యూజిలాండ్ వీధుల్లో సామాన్యుల్లా భారత క్రికెటర్లు.. వీడియో వైరల్!

02 Nov, 13:46

రోహిత్‌ వర్సెస్‌ కోహ్లీ: ఎవరు సెంచరీ చేస్తారు? పుజారా అంచనా ఇదే..!

02 Nov, 13:45

పాకిస్థాన్‌ విదేశాంగ విధానాన్ని నడిపించేది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పేసిన మంత్రి ఖవాజా

02 Nov, 13:37

అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. విమర్శకులకు రెహమాన్‌ సమాధానం!

02 Nov, 13:23

క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో పరుగులు తీసిన రోగులు.. ఇదిగో వీడియో!

02 Nov, 13:22

రూ.800 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్ 2'.. కోలీవుడ్‌లో రజనీకాంత్ సరికొత్త రికార్డ్!

02 Nov, 13:08

ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు వస్తుంది?

02 Nov, 12:50

పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

02 Nov, 12:43

61 ఏళ్లలోనూ అదే ఫిట్‌నెస్.. షారుక్ ఖాన్ సీక్రెట్ ఇదే!

02 Nov, 12:38

ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ. 11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

02 Nov, 12:26

ఏఐకి భౌతిక రూపం.. 'మ్యాక్స్' హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన మెటా!

02 Nov, 12:17

రాప్తాడు దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ కీలక అప్‌డేట్‌

02 Nov, 12:16

నవంబర్ 11 నుంచి కేటీఆర్ బస్సు యాత్ర.. 29న భారీ బహిరంగ సభ

02 Nov, 12:02

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌.. రాజీనామా చేసిన గంటల్లోనే బీజేపీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు!

02 Nov, 11:57

పులివెందుల పులి అన్నారు.. ఓటేయకుండా వెళ్లారు: జగన్‌పై అచ్చెన్న విమర్శలు

02 Nov, 11:48
..More Telugu News