3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..!

Sports
Advertisement
  • 2026 వరల్డ్‌కప్‌ విజేతగా నెదర్లాండ్స్‌ జోస్యం
  • ఆర్థికవేత్త జోయాకిమ్‌ క్లెమెంట్‌ అంచనా
  • 2014, 2018, 2022 జోస్యాలు నిజం
  • గణాంక మోడల్‌తో తాజా అంచనా
Advertisement
ఫుట్‌బాల్‌ ప్రపంచంలో అంచనాలు వేయడం అంత సులభం కాదు. స్టార్‌ ఆటగాళ్లు, ఫామ్‌, గాయాలు, అదృష్టం.. ఎన్నో అంశాలు మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేస్తుంటాయి. అయితే గత మూడు ఫిఫా వరల్డ్‌కప్‌ల విజేతలను వరుసగా కరెక్ట్‌గా అంచనా వేసిన ఓ ఆర్థికవేత్త ఇప్పుడు 2026 ప్రపంచకప్‌ విజేతపై తన జోస్యాన్ని వెల్లడించాడు. దీంతో అతడి తాజా అంచనా ఫుట్‌బాల్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.

జర్మనీకి చెందిన ఆర్థికవేత్త జోయాకిమ్‌ క్లెమెంట్‌ జనాభా పరిమాణం, జట్టు ర్యాంకింగ్‌ల వంటి గణాంకాల ఆధారంగా ప్రత్యేక మోడల్‌ను రూపొందించారు. ఈ మోడల్‌ 2014లో జర్మనీ, 2018లో ఫ్రాన్స్‌, 2022లో అర్జెంటీనా ప్రపంచకప్‌ గెలుస్తాయని ముందుగానే అంచనా వేసింది. ఆశ్చర్యకరంగా ఆ మూడూ నిజమయ్యాయి.

అయితే తన విజయాలను క్లెమెంట్‌ అదృష్టంగా కూడా అభివర్ణిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో అనూహ్య పరిణామాలు ఎప్పుడైనా చోటుచేసుకోవచ్చని, తన మోడల్‌ కేవలం కొంతవరకే ఫలితాలను అంచనా వేయగలదని చెప్పారు. ‘‘నాకేమీ క్రిస్టల్‌ బాల్‌ లేదు. వరుసగా మూడు సార్లు సరైన అంచనా చెప్పడం అదృష్టమే కావచ్చు’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ఇప్పుడు 2026 ఫిఫా వరల్డ్‌కప్‌ విజేతగా నెదర్లాండ్స్‌ నిలుస్తుందని క్లెమెంట్‌ అంచనా వేశారు. ‘‘జర్మన్‌గా చెప్పడం బాధగా ఉన్నా, ఈసారి నెదర్లాండ్స్‌ తమ చరిత్రలో తొలి వరల్డ్‌కప్‌ను గెలుస్తుందని నేను భావిస్తున్నాను’’ అని వెల్లడించారు. అతడి గత రికార్డు దృష్ట్యా ఈ అంచనా ఇప్పుడు ఫుట్‌బాల్‌ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.
Advertisement

సంబంధిత వార్తలు

Joachim KlementFIFA World Cup 2026Netherlands Football TeamWorld Cup Winner PredictionJoachim Klement Football PredictionFIFA World Cup 2026 Champion

More Telugu News

గ్రోక్ ఏఐతో ఆదాయం కంటే ఖర్చే ఎక్కువ: ఎలాన్ మస్క్

02 Nov, 14:19

దీపావళి ఎలా జరుపుకోవాలో ప్రజలకు తెలుసు.. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌కు బీజేపీ, శివసేన చురకలు

02 Nov, 14:03

జయ న‌న్ను అలా పిలవడం మా నాన్నకు నచ్చలేదు.. పెళ్లి నాటి సీక్రెట్ చెప్పిన అమితాబ్

02 Nov, 13:57

న్యూజిలాండ్ వీధుల్లో సామాన్యుల్లా భారత క్రికెటర్లు.. వీడియో వైరల్!

02 Nov, 13:46

రోహిత్‌ వర్సెస్‌ కోహ్లీ: ఎవరు సెంచరీ చేస్తారు? పుజారా అంచనా ఇదే..!

02 Nov, 13:45

పాకిస్థాన్‌ విదేశాంగ విధానాన్ని నడిపించేది సైన్యమే.. ఓపెన్‌గా చెప్పేసిన మంత్రి ఖవాజా

02 Nov, 13:37

అందరినీ మెప్పించాలంటే ఐస్‌క్రీమ్‌ అమ్ముకోవాలి.. విమర్శకులకు రెహమాన్‌ సమాధానం!

02 Nov, 13:23

క్లినిక్‌లో పేలిన మొబైల్ ఫోన్.. భయంతో పరుగులు తీసిన రోగులు.. ఇదిగో వీడియో!

02 Nov, 13:22

రూ.800 కోట్ల క్లబ్‌లోకి 'జైలర్ 2'.. కోలీవుడ్‌లో రజనీకాంత్ సరికొత్త రికార్డ్!

02 Nov, 13:08

ఆవలింతలు ఎందుకు వస్తాయి? ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు వస్తుంది?

02 Nov, 12:50

పబ్లిక్‌లో 'కావ్య, కావ్య' అరుపులు.. సిగ్గుతో నవ్వేసిన అనిరుధ్!

02 Nov, 12:43

61 ఏళ్లలోనూ అదే ఫిట్‌నెస్.. షారుక్ ఖాన్ సీక్రెట్ ఇదే!

02 Nov, 12:38

ఇండియా కూటమి ర్యాలీ వల్ల రూ. 11 వేల కోట్ల నష్టం.. ఎవరు చెల్లిస్తారన్న వ్యాపార సంఘాలు

02 Nov, 12:26

ఏఐకి భౌతిక రూపం.. 'మ్యాక్స్' హ్యూమనాయిడ్ రోబోను పరిచయం చేసిన మెటా!

02 Nov, 12:17

రాప్తాడు దాడిలో గాయపడిన బాలిక ఆరోగ్యంపై మంత్రి లోకేశ్‌ కీలక అప్‌డేట్‌

02 Nov, 12:16
..More Telugu News