పనిచేయని ఫేస్‌బుక్, ఇన్‌స్టా.. గంటల తరబడి యూజర్ల ఇబ్బందులు
- ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలు
- ఫీడ్ లోడ్ కాక, లాగిన్ సమస్యలతో యూజర్ల ఇబ్బందులు
- డౌన్‌డెటెక్టర్‌లో లక్షకు పైగా ఫిర్యాదుల నమోదు
వెబ్ సైట్ల అంతరాయాలను పర్యవేక్షించే, 'డౌన్‌డెటెక్టర్' ప్రకారం, ఫేస్‌బుక్‌కు సంబంధించి లక్షకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇదే తరహా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలామంది యూజర్లు తమ ఫీడ్‌లను రిఫ్రెష్ చేయలేకపోయారని, కొత్త కంటెంట్ లోడ్ కావడం లేదని పేర్కొన్నారు. మరికొందరికి లాగిన్ ప్రక్రియలో సమస్యలు ఎదురవగా, ఫేస్‌బుక్ మెసెంజర్ సేవల్లోనూ అంతరాయం ఏర్పడింది.
కొంతమంది వినియోగదారులు వెబ్‌సైట్లను యాక్సెస్ చేయగలిగినప్పటికీ, మొబైల్ యాప్స్‌లలో టైమ్‌లైన్‌లు అప్‌డేట్ కాలేదు. ఈ సాంకేతిక లోపంపై అసహనం వ్యక్తం చేస్తూ నెటిజన్లు 'ఎక్స్' వంటి ఇతర సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారు.