ఈ రాత్రే ఇరాన్‌పై తీవ్ర దాడులు: ట్రంప్ సంచలన ప్రకటన

International
Advertisement
  • ఇరాన్ కీలక ఆయిల్ కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని వెల్లడి
  • ఇప్పటికే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సైనిక ఘర్షణలు
  • దాడుల హెచ్చరికల మధ్యే కొనసాగుతున్న దౌత్యపరమైన చర్చలు
Advertisement
అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాకస్థాయికి చేరాయి. ఇరాన్‌పై ఈ రాత్రే భారీస్థాయిలో దాడులు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో ఇరాన్‌కు చెందిన కీలక చమురు క్షేత్రాలను, ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

గురువారం తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఈ రాత్రే అమెరికా బలగాలు ఇరాన్‌పై అత్యంత తీవ్రమైన దాడులు చేయనున్నాయి. త్వరలోనే ఖర్గ్ ద్వీపంతో పాటు ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుంటాం. వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణ సాధిస్తాం" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఇప్పటికే ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల ఇరాన్‌కు చెందిన గగనతల రక్షణ, నిఘా వ్యవస్థలపై అమెరికా దాడులు నిర్వహించింది. మరోవైపు, తమ అపాచీ హెలికాప్టర్‌ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న ఖర్గ్ ద్వీపం, ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం. ఆ దేశం నుంచి జరిగే ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఇక్కడి నుంచే సాగుతాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. సైనిక చర్యల హెచ్చరికల కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని, అయితే అవి మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తోంది.
Advertisement

సంబంధిత వార్తలు

Donald TrumpIranKharg IslandUS Iran conflictIran oil fieldsTruth Social

More Telugu News

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21

ఉద్యోగులకు ఈపీఎఫ్‌వో గుడ్‌న్యూస్‌.. పీఎఫ్‌ సేవలు ఇక మీ వాట్సాప్‌లోనే

02 Nov, 15:19

విటమిన్ బీ12 ఎందుకంత కీలకం? లోపిస్తే ఏం జరుగుతుంది?

02 Nov, 15:18

నటనలో 'బాద్‌షా'.. వ్యాపారంలోనూ 'కింగ్'.. షారుఖ్ ఆస్తుల విలువ రూ. 10,000 కోట్లు!

02 Nov, 15:04

48 ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

02 Nov, 15:02

హైదరాబాద్‌ చేరుకున్న అమిత్ షా.. చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం

02 Nov, 15:00

ఈ అర్ధరాత్రి తీరం తాకనున్న 'మురసు' తుపాను.. ఒంగోలుకు 170 కి.మీ దూరంలో కేంద్రీకృతం

02 Nov, 14:57

మంత్రి పదవి ఇవ్వలేదు.. నిధులూ రావడం లేదు.. రేవంత్‌ ప్రభుత్వంపై కోమటిరెడ్డి ఆగ్రహం

02 Nov, 14:38

వైసీపీలో తీవ్ర మనోవేదన అనుభవించా.. 11న పార్టీని ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

02 Nov, 14:34

ఏపీలో పరిషత్ పోరు.. ఈ నెల 4,5 తేదీల్లో సెలవు ప్రకటించిన ప్రభుత్వం

02 Nov, 14:28
..More Telugu News