'పెద్ది' చిత్రానికి కాసుల వర్షం.. ఆరు రోజుల్లోనే అరుదైన రికార్డు

Entertainment
Advertisement
  • బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' సినిమా వసూళ్ల వర్షం
  • ఆరు రోజుల్లోనే రూ. 332 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు
  • వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
  • రామ్ చరణ్ నటనకు ప్రశంసల వెల్లువ
Advertisement
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన 'పెద్ది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా విడుదలైన కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 332.1 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి దూసుకుపోతోంది.

జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాకు తొలిరోజు నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సినిమా వసూళ్ల వివరాలను నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ భారీ విజయం పట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్నాయి. ఆయన కెరీర్‌లో ఇదొక గుర్తుండిపోయే పాత్రగా నిలుస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించగా, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ, రవికిషన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించి తమ నటనతో ఆకట్టుకున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Ram CharanPeddi movie box officeBuchi Babu SanaJanhvi KapoorAR RahmanPeddi collection record

More Telugu News

మురసు తుపాను ఎఫెక్ట్: ఏపీలో పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

02 Nov, 16:45

రిలయన్స్‌ దూకుడుతో మార్కెట్ల పరుగులు.. 1,233 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌

02 Nov, 16:39

అసలు వీటిని ఎన్నికలంటారా?: రవీంద్రనాథ్ రెడ్డి

02 Nov, 16:35

దిగ్గజ జట్లకు షాక్.. వన్డే ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌ సంచలనం

02 Nov, 16:17

రీపోలింగ్ అన్ని కేంద్రాల్లో నిర్వహించాలి: షర్మిల డిమాండ్

02 Nov, 16:14

ఎన్నికల సంఘం అధికార పార్టీకి కొమ్ముకాయడం దారుణం: జగన్

02 Nov, 16:14

హైదరాబాద్‌లో పాదయాత్రకు ముందు కాంగ్రెస్‌పై అమిత్‌ షా ఆసక్తికర పోస్ట్‌!

02 Nov, 16:07

బెంగళూరు ఆసుపత్రికి జగన్.. రాప్తాడు బాధితురాలికి పరామర్శ

02 Nov, 15:59

పల్లీలు తింటే అల్జీమర్స్‌ ముప్పు తగ్గుతుందా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

02 Nov, 15:56

టూత్ బ్రష్ నుంచి తలగడ వరకు... ఈ వస్తువులు ఎప్పుడు మార్చాలో తెలుసా?

02 Nov, 15:54

ప్రకటనల స్థానంలో పోర్న్‌ వీడియోలు.. పలు దేశాల్లో డిజిటల్‌ బోర్డ్‌లు హ్యాక్‌!

02 Nov, 15:48

చంద్రబాబు వచ్చాక ఏపీని బీహార్‌లా మార్చేశారు: విడదల రజని

02 Nov, 15:38

ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరం ఏదో తెలుసా?

02 Nov, 15:35

రాప్తాడు ఉన్మాది ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల‌ కీలక ప్రకటన.. కాలు కోల్పోనున్న హేమంత్?

02 Nov, 15:27

యువ సంచలనాన్ని నిరుత్సాహపరుస్తున్నారు: టీమిండియాపై శ్రీకాంత్ అసంతృప్తి

02 Nov, 15:21
..More Telugu News