మాస్కోలో వ్యాధి నిర్ధారణ చేసే ఏటీఎం... నారా లోకేష్ ఆశ్చర్యం
- మాస్కోలోని స్బేర్ సిటీని సందర్శించిన మంత్రి నారా లోకేష్
- వ్యాధి నిర్ధారణ చేసే స్బేర్ బ్యాంక్ ఏటీఎంను పరిశీలన
- ఏఐ, క్వాంటం టెక్నాలజీపై ప్రజెంటేషన్ ఇచ్చిన ప్రతినిధులు
- డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ సొల్యూషన్స్‌పై ఆరా
ఈ సందర్భంగా, స్బేర్ బ్యాంక్‌కు చెందిన ఒక ప్రత్యేక ఏటీఎం మంత్రి లోకేష్ దృష్టిని ఆకర్షించింది. సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు వ్యాధి నిర్ధారణ చేసే సామర్థ్యం ఉన్న ఈ ఏటీఎం పనితీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. అక్కడి ఆవిష్కరణలను చూసి ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
అనంతరం, స్బేర్ సిటీ ప్రతినిధులు తమ సంస్థలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆర్ & డీ, క్వాంటం టెక్నాలజీ సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత సేవలు, డిజిటల్ హెల్త్‌కేర్, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఎడ్యుకేషన్ వంటి అంశాలపై తమకున్న పరిష్కారాలను వారు లోకేష్‌కు తెలిపారు.