Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇన్‌స్టాగ్రామ్ వేదిక మాత్రమే, బ్యాలెట్ బాక్స్ కాదు.. కాక్రోచ్‌ పార్టీపై శశి థరూర్‌

Shashi Tharoor Message To Gen Z On Cockroach Janta Party Movement
Advertisement
  • యువత ఆందోళనలు సమంజసమేనని శశిథరూర్ మద్దతు
  • వ్యవస్థలో ఉంటూనే మార్పు కోసం పోరాడాలని పిలుపు
  • ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచన
  • సోషల్ మీడియా నిరసనలతోనే సమస్యలు తీరవని హితవు
  • కాక్రోచ్ జనతా పార్టీపై థరూర్ వ్యాసం
Advertisement
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ యువతకు, ముఖ్యంగా జెన్-జీ తరానికి కీలక సందేశం ఇచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) ఉద్యమాన్ని ఉద్దేశించి ఆయన ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పత్రికలో వ్యాసం రాశారు. ‘‘ఇన్‌స్టాగ్రామ్ అనేది మీ అభిప్రాయాలను పంచుకునే ఒక వేదిక మాత్రమే. కానీ అది ఓటు వేసే బ్యాలెట్ బాక్స్ కాదు’’ అని స్పష్టం చేశారు. కేవలం సోషల్ మీడియా నిరసనలతోనే మార్పు రాదని, వ్యవస్థలో భాగస్వాములు కావడం ద్వారానే శాశ్వత మార్పు సాధ్యమవుతుందని యువతకు హితవు పలికారు.

పేపర్ లీక్‌లు, పరీక్షల నిర్వహణలో వైఫల్యాల వల్ల యువత ఎదుర్కొంటున్న నిరాశ, కోపం చాలా సమంజసమైనవని థరూర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ కోపాన్ని కేవలం ఆన్‌లైన్ హేళనలకే పరిమితం చేయకుండా చట్టపరమైన, ప్రజాస్వామ్య మార్గాల్లో ఉపయోగించాలని సూచించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించడం, ప్రజాప్రతినిధులను నిలదీయడం వంటి పనుల ద్వారా వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావచ్చని సూచించారు. నిర్దిష్టమైన డిమాండ్లతో పోరాడినప్పుడే మీడియా కూడా సమస్యలతో పాటు పరిష్కారాలను చూపిస్తుందని పేర్కొన్నారు.

యువత తమ నిరసనను కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా పద్ధతి ప్రకారం ముందుకు తీసుకెళ్లాలని థరూర్ పిలుపునిచ్చారు. విద్యార్థి సంఘాలు, న్యాయ నిపుణులు, పాలసీ సంస్థలతో కలిసి పనిచేసి గట్టిగా లాబీయింగ్ చేయాలన్నారు. ‘‘మీ కోపం నిరాశగా మారిపోనివ్వకండి. మీ సంఖ్యా బలం, డిజిటల్ పరిజ్ఞానంతో దీర్ఘకాలిక మార్పు కోసం పోరాడండి’’ అని ఆయన ముగించారు. నిరుద్యోగం, పరీక్షల వివాదాలపై అభిజిత్ దిప్కే అనే యువకుడు సోషల్ మీడియాలో సరదాగా ప్రారంభించిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఉద్యమం ప్రస్తుతం దేశవ్యాప్తంగా మిలియన్ల మంది యువతను ఆకర్షిస్తోంది.
Advertisement
Advertisement
Shashi Tharoor
Instagram
Cockroach Janta Party
Abhijeet Dipke
social media
Gen Z
Shashi Tharoor
Indian Express
Paper leaks India

More Telugu News