పెద్ది విడుదల.. శ్రీవారి సేవలో హీరోయిన్ జాన్వీ కపూర్
- రామ్ చరణ్ సరసన కనిపించిన జాన్వీ కపూర్
- డైరెక్టర్‌గా బుచ్చిబాబు సానా
- సంప్రదాయబద్ధంగా పట్టుచీరలో శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ
- గుడి ముందు సాష్టాంగ నమస్కారం
‘పెద్ది’ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించారు. ఇందులో రామ్ చరణ్ ఒక క్రాస్ఓవర్ అథ్లెట్‌గా కనిపించాడు. అతడు క్రికెట్, కుస్తీ వంటి క్రీడల్లో రాణించే యువకుడిగా అలరించాడు. పల్లెటూరి నేపథ్యంతో సాగే ఈ కథలో ఓ పట్టుదల గల యువకుడు క్రీడా పోటీల ద్వారా ఎలా పైకి వచ్చాడనేది చూపించారు. నిన్న సాయంత్రమే ప్రారంభమైన ప్రీమియర్ షోలతో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.