కర్ణాటక నూతన సీఎం డీకే శివకుమార్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
- పదవీకాలం విజయవంతం కావాలని పేర్కొన్న మోదీ
- ప్రజల సంక్షేమం కోసం కేంద్రం సహకరిస్తుందని హామీ
- కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ఈరోజు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలియజేశారు. "కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్‌కు అభినందనలు. ఆయన పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. కర్ణాటక ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది" అని ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా పోస్ట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో 2023లో కుదిరిన అనధికారిక పంపకాల ఒప్పందంలో భాగంగా ఈ మార్పు జరిగింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య మే 28న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ వంటి అగ్రనేతలు హాజరయ్యారు.