భారత్‌పై అమెరికా మళ్లీ టారిఫ్స్.. కేంద్రం స్పందన ఇదే..!
- వెట్టిచాకిరి చేయించి ఉత్పత్తులు తయారుచేయించారని అమెరికా ఆరోపణ
- అందుకుగానూ 12.5 శాతం పన్ను విధించాలని ప్రతిపాదన
- ఇది ఇంకా ఖరారు కాలేదని కేంద్రం ప్రభుత్వం వివరణ
- వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు సాగుతున్నట్లు వెల్లడి
దీనిపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందిస్తూ అమెరికాతో వాణిజ్య ఫ్రేమ్‌వర్క్ ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు చర్చలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ పన్నుల ప్రతిపాదన ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ దశలోనే ఉందని పేర్కొంది. సంబంధిత వర్గాలు 2026 జూన్ 22లోపు తమ విజ్ఞప్తులను సమర్పించవచ్చని, జులై 7 తర్వాతే అమెరికా తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.
ఇప్పటికే సెక్షన్ 232 కింద ఉన్న కొన్ని ఉత్పత్తులకు ఈ కొత్త పన్నుల నుంచి మినహాయింపు లభించింది. అలాగే టెక్స్‌టైల్ రంగానికి అమెరికా ప్రత్యేక వెసులుబాటును ప్రతిపాదించింది. దీని ప్రకారం నిర్దేశిత పరిమాణంలోని దుస్తుల దిగుమతులపై తక్కువ పన్ను రేట్లు విధించే అవకాశం ఉంది. పరస్పర వాణిజ్య ఒప్పందాలు అంగీకరించే దేశాలకు ఈ పన్ను 10 శాతంగా ఉంటుంది. ప్రస్తుతానికి చర్చలు నడుస్తున్నందున ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారత్ వెల్లడించింది.