ఇరాన్ అధినేత మొజ్తబాతో భేటీకి సిద్ధం: డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమన్న ట్రంప్
  • తండ్రి మరణం తర్వాత మొజ్తబా ఖమేనీ బాధ్యతల స్వీకారం
  • బాధ్యతలు చేపట్టినా ఇప్పటికీ ప్రజల ముందుకు రాని మొజ్తబా
  • దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు
  • కాల్పుల విరమణ నేపథ్యంలో తెరవెనుక చర్చల ప్రయత్నాలు
  • చర్చల పురోగతిపైనే భేటీ ఆధారపడి ఉంటుందని స్పష్టం
అమెరికా, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీతో భేటీ అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంకేతాలిచ్చారు. పరిస్థితులు అనుకూలిస్తే ఏదో ఒక సమయంలో ఆయన్ను కలవాలనుకుంటున్నానని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ పేర్కొన్నారు.

గత ఫిబ్రవరిలో అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. తండ్రి మరణానంతరం మొజ్తబా సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటికీ, అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఆరోగ్యం, పాలనా సామర్థ్యంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వచ్చాయి.

అయితే, మొజ్తబా ఖమేనీ బతికే ఉన్నారని, మధ్యవర్తుల ద్వారా, రాతపూర్వకంగా పరిపాలనలో పాల్గొంటున్నారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మంగళవారం తెలిపారు. ఈ విషయాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు. పాలనాపరమైన నిర్ణయాలకు మొజ్తబా ఆమోదం తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఇరు పక్షాల మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

Trump On Prospects Of Talks With Mojtaba Khamenei
Trump want to meet Iran leader

More Telugu News