పవన్ మాటలు అర్థం లేనివి.. తెలివి తక్కువగా మాట్లాడటం మంచిది కాదు: బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి

  • పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి
  • తెలంగాణలో కాంగ్రెస్, జనసేన మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని ఆరోపణ
  • ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఈ డ్రామా అని వ్యాఖ్య
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్‌మీట్‌పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్ మాటలు అర్థం లేనివని, తెలివి తక్కువగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, పవన్ కల్యాణ్ కలిసి ఒక పెద్ద నాటకానికి తెరలేపారని ఆయన ఆరోపించారు.

తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం వెనుక పెద్ద కుట్ర ఉందని జగదీశ్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ, జనసేన మధ్య ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ ఈ ఘటనతో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో నెలకొన్న ప్రజా సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హైడ్రామా నడుపుతున్నారని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. పవన్ కల్యాణ్, కాంగ్రెస్ పార్టీలు కావాలనే ఈ నాటకాన్ని సృష్టించాయని ఆయన విమర్శించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Jagadish Reddy
Pawan Kalyan
Press meet
Hyderabad
Jana Sena

More Telugu News