గల్ఫ్‌లో మళ్లీ ఉద్రిక్తత.. కువైట్, బహ్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడిన ఇరాన్
- క్షిపణులు, డ్రోన్లతో కువైట్‌పై ఇరాన్ దాడి
- దాడిని గాల్లోనే అడ్డుకున్న కువైట్ సైన్యం
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా దాడులని ప్రకటించిన ఇరాన్
- ఇరాన్‌లోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవిలోనూ పేలుళ్ల కలకలం
శత్రువుల నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్ల దాడులను ఎదుర్కొంటున్నామని కువైట్ సైన్యం ప్రకటించింది. ఈ క్రమంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయిన వస్తువుల వద్దకు వెళ్లవద్దని సూచించింది. ఇటీవల తమ రాడార్, డ్రోన్ సైట్లపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలు చేపట్టినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. అమెరికాకు చెందిన ఐదో ఫ్లీట్, ఎయిర్ బేస్‌ను లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది.
ఇదే సమయంలో, హర్మూజ్ జలసంధిలోని వ్యూహాత్మక ఖెష్మ్ దీవి ప్రాంతంలోనూ భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. అయితే, ఈ పేలుళ్లకు కారణమేమిటనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా దాడులతో బహ్రెయిన్‌లోనూ సైరన్లు మోగాయి. ఇరాన్ చర్యలను కువైట్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ పరిణామాలతో శాంతి చర్చలకు ఆటంకం కలగడంతో పాటు, హార్ముజ్ జలసంధిలో రవాణాకు అంతరాయం ఏర్పడి చమురు ధరలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.