ఓటీటీలో లోకేశ్ కనగరాజ్ మూవీ!
- తమిళంలో రూపొందిన సినిమా '29'
- నిర్మాతలుగా స్టార్ డైరెక్టర్లు
- మే 8న విడుదలైన సినిమా
- ఈ నెల 5వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో
- 5 భాషల్లో అందుబాటులోకి
ఈ మధ్య కాలంలో స్టార్ డైరెక్టర్లు ఒక వైపున తమ సినిమాలు చేస్తూనే, మరో వైపున నిర్మాతగాను ప్రయోగాలు చేస్తున్నారు. అలా కార్తీక్ సుబ్బరాజుతో కలిసి లోకేశ్ కనగరాజ్ నిర్మించిన సినిమానే '29'. విధు - ప్రీతీ అస్రాని జంటగా నటించిన ఈ సినిమా, మే 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ క్యూట్ లవ్ స్టోరీ యూత్ వైపు నుంచి మంచి మార్కులే తెచ్చుకుంది. ఫీల్ తో కూడిన ఈ కథకి బాగానే కనెక్ట్ అయ్యారు.
అలాంటి ఈ సినిమా ఓటీటీ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' దక్కించుకుంది. ఈ నెల 5వ తేదీ నుంచి తమిళంతో పాటు తెలుగు .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా వదిలారు. మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ నిర్మించిన సినిమా కావడంతో, ఈ సినిమా కోసం ఓటీటీ ఆడియన్స్ ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఓటీటీలో ఈ సినిమా ఒక ఊపు ఊపేసేలానే కనిపిస్తోంది మరి.