బరువు తగ్గడానికి భలే బ్రేక్ ఫాస్ట్!

  • బరువు తగ్గడానికి ఉదయం పూట పెరుగు, చియా గింజల మిశ్రమం
  • గంటల తరబడి ఆకలిని నియంత్రించే ఫైబర్, ప్రొబయోటిక్స్
  • ఢిల్లీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య సూచన
  • పరాఠాల వంటి వాటికి బదులుగా ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
ఉదయం పూట మనం తీసుకునే ఆహారమే రోజంతా మనల్ని ఎలా ఉంచుతుందో నిర్ణయిస్తుంది. ఉత్సాహంగా ఉండాలా లేక నీరసంగా ఉండాలా అనేది మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. అయితే, చాలామంది సమయం లేకపోవడంతో అల్పాహారం మానేయడం లేదా అనారోగ్యకరమైన ఫాస్ట్ ఫుడ్ తినడం చేస్తుంటారు. కానీ, కొన్ని సులభమైన మార్గాలతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ సిద్ధం చేసుకోవచ్చు.

బరువు తగ్గాలనుకునే వారు, తరచూ ఆకలితో ఇబ్బందిపడేవారు ఉదయాన్నే మొదటి ఆహారంగా పెరుగులో చియా గింజలు లేదా సబ్జా గింజలు కలిపి తీసుకోవాలని ఢిల్లీకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శుభమ్ వత్స్య సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పుతో రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటారని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తెలిపారు. "ఇది చాలా సులభం, రుచికరమైనది, కొవ్వు తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది" అని ఆయన వివరించారు.

ఎలా పనిచేస్తుంది?

పెరుగులో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. మరోవైపు, చియా లేదా సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలుగుతుంది. దీంతో పదేపదే ఆకలి వేయదు. ఈ గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఈ మిశ్రమాన్ని ఉదయం తీసుకుంటే కనీసం నాలుగు గంటల పాటు ఆకలి వేయదని డాక్టర్ వత్స్య హామీ ఇస్తున్నారు. దీనివల్ల రోజంతా తీసుకునే కేలరీల సంఖ్య తగ్గి, బరువు నియంత్రణలో ఉంటుంది. పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న భోజనం తర్వాత కలిగే చిరుతిండి కోరికలు కూడా తగ్గుతాయి. ఈ అలవాటు చేసుకుంటే మీరు ఉదయాన్నే పరాఠాలు తినడం మానేస్తారని ఆయన అన్నారు.

ఇతర ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఎంపికలు:

గ్రీక్ యోగర్ట్: ఫ్లేవర్ లేని గ్రీక్ యోగర్ట్‌లో నట్స్, పండ్లు కలుపుకుని తినవచ్చు.
చియా పుడ్డింగ్: రాత్రి పాలలో చియా గింజలు నానబెట్టి, ఉదయం పండ్లు, నట్స్‌తో కలిపి తీసుకోవచ్చు.
వెజిటబుల్ ఆమ్లెట్: ప్రోటీన్లు అధికంగా ఉండే గుడ్లతో పాటు ఫైబర్ కోసం కూరగాయలు జోడించి ఆమ్లెట్ వేసుకోవచ్చు.

Best breakfast for health
Healthy breakfast

More Telugu News