తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా పోలీసులకు పతకాలు

Telangana Police Medals Announced on State Formation Day
  • విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్‌కు సర్వోన్నత పోలీసు పతకం
  • భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు శౌర్య పతకాలు
  • 16 మందికి మహోన్నత సేవా పతకాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఉత్తమ సేవలు అందించిన 632 మంది పోలీసులు, అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు వారి పేర్లను ప్రకటించింది. విశిష్ఠ, అత్యుత్తమ మరియు ఉత్తమ సేవలకు గుర్తింపుగా, పోలీస్, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, అవినీతి నిరోధక బ్యూరో, ప్రత్యేక రక్షణ దళం, అగ్నిమాపక సేవల విభాగాలకు చెందిన సిబ్బందిని వివిధ పతకాలకు ఎంపిక చేశారు.

తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ చీఫ్ ప్రతాప్‌కు సీఎం సర్వోన్నత పోలీసు పతకం దక్కింది. భద్రాద్రి కొత్తగూడెం రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ రవి, చెర్ల సీఐ రాజులకు తెలంగాణ పోలీస్ శౌర్య పతకాలను ప్రకటించారు. ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సంపత్, గ్రేహౌండ్స్‌లోని మరో ఏడుగురిని శౌర్య పతకాలు వరించాయి. 16 మందికి మహోన్నత సేవా పతకాలు, 94 మందికి ఉత్తమ సేవా పతకాలు, 50 మంది కఠిన సేవా పతకాలు, మరో 461 మంది సేవా పతకాలు అందుకోనున్నారు.
Go Back to Shorts
Telangana Police
Telangana Formation Day
Telangana State
Police Medals
Pratap Telangana Police

More Telugu News