భారత్కు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. ఢిల్లీలో భారీ నిరసనలకు పిలుపు
జూన్ 6న భారత్కు రానున్న అభిజిత్ దీప్కే
పరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు
పరీక్షల వివాదాలపై నిరసన తెలిపేందుకు సిద్ధం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్
జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలకు పిలుపు
ఎయిర్పోర్ట్ నుంచే నిరసనలు
ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను విడుదల చేసిన అభిజీత్ దీప్కే.. జూన్ 6 శనివారం ఉదయం తాను ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల లోపాల వల్ల తీవ్ర ఆందోళనలో ఉన్న విద్యార్థులు, తమ పార్టీ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘మనం అంతా కలిసి భారత రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా మన గొంతు వినిపించాల్సిన సమయం వచ్చింది. మేమంతా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు వెళ్లి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసనలు చేపట్టడానికి అనుమతి కోరతాం’’ అని దీప్కే వెల్లడించారు.