ఫెవిక్విక్ అన్నింటికీ అతుక్కుంటుంది.. కానీ బాటిల్‌కి ఎందుకు అతుక్కోదు?
- ఫెవిక్విక్ పని చేయాలంటే కచ్చితంగా ‘తేమ’ అవసరం
- బాటిల్ లోపల గాలి, తేమ లేకపోవడం వల్ల ద్రవరూపంలోనే గ్లూ
- గాలి తగలగానే పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా క్షణాల్లో గట్టిపడుతుంది
- 1942లో తుపాకుల పరిశోధనలో పొరపాటున దీని ఆవిష్కరణ
- కాటన్ దుస్తులపై వేస్తే రసాయన చర్య జరిగి వేడి పుడుతుంది
మెటల్, ప్లాస్టిక్, రబ్బర్.. చివరకు పొరపాటున చేతికి తగిలినా క్షణాల్లో గట్టిగా అంటించేసే శక్తి ‘ఫెవిక్విక్’ సొంతం. మరి అన్నింటినీ క్షణాల్లో అతికించే ఈ సూపర్ గ్లూ, తన సొంత ప్లాస్టిక్ బాటిల్ లోపల మాత్రం ఎందుకు అతుక్కోదు? ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక సింపుల్ సైన్స్ దాగి ఉంది.
అసలు రహస్యం ‘తేమ’
ఫెవిక్విక్‌ను సాంకేతిక భాషలో సైనోఆక్రిలేట్ అంటారు. దీని ప్రధాన రసాయనం ‘ఇథైల్ సైనోఆక్రిలేట్’. ఈ గ్లూ పని చేయడం ప్రారంభించాలంటే దానికి కచ్చితంగా ‘తేమ’ (నీటి శాతం) అవసరం. ఫెవిక్విక్ బాటిల్‌ను ప్యాక్ చేసేటప్పుడు అందులో అస్సలు తేమ లేకుండా (Air-tight) జాగ్రత్తపడతారు. లోపల తేమ లేకపోవడం వల్ల, గ్లూ గట్టిపడకుండా ఎప్పుడూ ద్రవరూపంలోనే ఉంటుంది.
బయటకు రాగానే ఏం జరుగుతుంది?
ఫెవిక్విక్ చుక్క బాటిల్ నుంచి బయటకు వచ్చి గాలి తగలగానే లేదా ఏదైనా వస్తువుపై పడగానే అక్కడ వాతావరణంలో ఉండే కొద్దిపాటి తేమను అది గ్రహిస్తుంది. ఈ తేమ తగలగానే అందులోని అణువులన్నీ కలిసి గట్టి గొలుసుకట్టుగా మారే పాలిమరైజేషన్ రసాయన ప్రక్రియ మొదలవుతుంది. ఈ రియాక్షన్ వల్ల ద్రవరూపంలో ఉన్న గ్లూ కాస్తా క్షణాల్లో గట్టి పొరలా మారి వస్తువులను అంటించేస్తుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొద్దిగా వేడి కూడా పుడుతుంది.
బాటిల్ లోపల గ్లూ గట్టిపడకపోవడానికి కారణాలు:
మరి క్యాప్ ఎందుకు గట్టిగా అతుక్కుపోతుంది?
చాలాసార్లు ఫెవిక్విక్ వాడిన తర్వాత మూత గట్టిగా అతుక్కుపోయి అస్సలు రాదు. దీనికి కారణం.. వాడిన తర్వాత బాటిల్ చివరన కొద్దిగా గ్లూ మిగిలిపోతుంది. అది గాల్లోని తేమను గ్రహించి అక్కడికక్కడే గట్టిపడిపోవడం వల్ల మూత లాక్ అయిపోతుంది. అందుకే వాడిన ప్రతిసారీ నాజిల్‌ను శుభ్రం చేసి మూత గట్టిగా పెట్టాలి.
ఫెవికాల్ vs ఫెవిక్విక్.. తేడా ఏంటి?
ఫెవికాల్: ఇది పాలీవినైల్ ఎసిటేట్. నీటితో తయారవుతుంది. దీన్ని రాసినప్పుడు అందులోని నీరు నెమ్మదిగా ఆవిరైపోవడం ద్వారా వస్తువులు అతుక్కుంటాయి. అందుకే ఇది ఎండడానికి సమయం పడుతుంది.
ఫెవిక్విక్: ఇది ఆవిరి కావడం వల్ల ఎండదు. గాల్లోని తేమ తగలడం వల్ల క్షణాల్లో రసాయన చర్య జరిగి గట్టిపడుతుంది.
పొరపాటున ఆవిష్కరణ
ఈ సూపర్ గ్లూ ఆవిష్కరణ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. 1942లో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తుపాకులలో ‘గురి చూసే పరికరాల’ తయారీ కోసం ‘హ్యారీ కూవర్ జూనియర్’ అనే శాస్త్రవేత్త పరిశోధనలు చేస్తూ పొరపాటున ఈ రసాయనాన్ని కనిపెట్టాడు. అది చేతికి, వస్తువులకు విపరీతంగా అతుక్కుపోతుండటంతో అప్పట్లో దాన్ని పక్కన పడేశారు. ఆ తర్వాత 1951లో దీని విలువను గుర్తించి మార్కెట్లోకి తెచ్చారు.

- బాటిల్ లోపలికి గాలి, తేమ వెళ్లకుండా ప్యాకింగ్ డిజైన్ చేయడం.
- గ్లూ త్వరగా గట్టిపడకుండా నిరోధించే కొన్ని ‘స్టెబిలైజర్స్’ రసాయనాలను అందులో కలపడం.
- బాటిల్ తయారు చేసే ప్లాస్టిక్ పదార్థం ఈ గ్లూతో ఎలాంటి రసాయన చర్య జరపకపోవడం.