కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విమర్శలు

Congress MLA Yennam Srinivas Reddy Criticizes KCR Over Phone Tapping
  • బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపణ
  • జడ్జీలు, జర్నలిస్టులు, నటుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని వ్యాఖ్య
  • బీఆర్ఎస్‌కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని స్పష్టీకరణ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడి ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాశారని, అందుకే వారికి మళ్లీ ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం జడ్జీలు, జర్నలిస్టులు, నటీనటులు, రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరి ఫోన్లను ట్యాప్ చేసి, వారిని బెదిరించి నియంత్రించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. దీన్ని ఒక రాక్షస క్రీడగా, క్రూరమైన, వ్యవస్థీకృత నేరంగా అభివర్ణించారు. ఈ చర్యల వల్ల ఎంతోమంది బాధితులుగా మారారని ఆయన పేర్కొన్నారు.

"కేసీఆర్‌కు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదు" అని తేల్చిచెప్పిన యెన్నం, ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే, తమకు ఓటు వేయని వారిని గుర్తించి వేధించేందుకు మళ్లీ భారీస్థాయిలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే లక్షలమంది ఫోన్లపై నిఘా పెడతారని ఆరోపించారు.
Go Back to Shorts
KCR
KCR phone tapping
Yennam Srinivas Reddy
BRS party
Telangana politics
Phone tapping case

More Telugu News