ట్రైన్ టాయిలెట్లో గిన్నెలు కడిగిన సిబ్బంది.. రంగంలోకి ఎఫ్ఎస్ఎస్ఏఐ!
- ముంబై-ఎర్నాకుళం దురంతో ఎక్స్ప్రెస్లో ఘటన
- సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన వీడియో
- ఐఆర్సీటీసీకి నోటీసులు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
- వివరణ ఇవ్వాలంటూ ఆహార భద్రతా సంస్థ ఆదేశం
ముంబై నుంచి ఎర్నాకుళం వెళ్లే దురంతో ఎక్స్ప్రెస్ రైలులో అత్యంత జుగుప్సాకరమైన ఘటన వెలుగుచూసింది. రైలులోని ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్ టాయిలెట్లో ఐఆర్సీటీసీ క్యాటరింగ్ సిబ్బంది ఒకరు ప్లేట్లు, స్పూన్లు, గిన్నెలను కడుగుతుండగా ఓ ప్రయాణికుడు వీడియో తీశాడు. టాయిలెట్ సీటుపై గిన్నెల బుట్టను ఉంచి మరీ వాటిని శుభ్రం చేస్తున్న ఆ సిబ్బందిని సదరు ప్రయాణికుడు నిలదీశాడు. ఈ వీడియో వైరల్గా మారడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఉదంతంపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) తీవ్రంగా స్పందించింది. ఆహార నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకుగానూ ఐఆర్సీటీసీకి నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో తక్షణమే వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రయాణికుల ఆరోగ్యం, పరిశుభ్రతతో చెలగాటమాడే ఇలాంటి పనులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను డిమాండ్ చేస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు.