మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు!: లోకేష్ కౌంటర్

  • మెగా డీఎస్సీపై జగన్‌ వ్యాఖ్యలు
  • జగన్ ను టార్గెట్ చేసిన మంత్రి లోకేష్
  • 16 వేల మంది టీచర్లను జగన్ అవమానిస్తున్నారని విమర్శ
  • ఎంపికైన అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
  • త్వరలోనే మరో డీఎస్సీ ఇస్తామని వెల్లడి
  • ఉద్యోగాలను అడ్డుకుంటూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపణ
మెగా డీఎస్సీపై వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం జగన్ పై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను జగన్ అవమానిస్తున్నారని, వారికి లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

"మీ బాధ, ఆక్రోశం నేను అర్థం చేసుకోగలను జగన్ రెడ్డి గారు! మీ ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చెయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. మేం 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం. 10 వేల పోస్టులతో జాబ్ క్యాలెండర్ ఇచ్చాం. త్వరలోనే మరో డీఎస్సీ కూడా ఇవ్వబోతున్నాం. మ‌రింత బిగ్గ‌ర‌గా ఏడ‌వ‌డానికి సిద్ధంగా ఉండండి జ‌గ‌న్ గారూ! 

మీరు టెన్త్ పేప‌ర్లు ఎత్తుకెళ్లిన దొంగ అని, అంద‌రూ అలాగే ఉంటార‌నుకోవ‌డం చాలా పెద్ద నేరం. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించిన మెగా డీఎస్సీలో, నిద్రాహారాలు మాని, చ‌దివి ప్ర‌తిభతో ఉద్యోగాలు సాధించిన 16 వేల మందిని మీరు అనుమానిస్తున్నారు, అవ‌మానిస్తున్నారు. మెగా డీఎస్సీలో ఎంపికైన టీచ‌ర్లు అంద‌రికీ జ‌గ‌న్ గారు లెంప‌లు వేసుకుని క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి. మెగా డీఎస్సీ ఆపాల‌ని 200 కేసులు, గూగుల్, టీసీఎస్ రాకుండా కోర్టులో కేసులు వేయించారు. రాష్ట్రానికి పెట్టుబ‌డులు రాకుండా, యువ‌తకు ఉద్యోగాలు లేకుండా వారి భ‌విష్య‌త్తు నాశ‌నం చేయాల‌ని చూస్తున్న జ‌గ‌న్ గారూ మిమ్మ‌ల్ని రాష్ట్ర ప్ర‌జ‌లు ఎన్న‌టికీ క్ష‌మించ‌రు" అంటూ లోకేష్ ఘాటుగా స్పందించారు. 

Nara Lokesh
Jagan Mohan Reddy
AP DSC
Mega DSC
Andhra Pradesh Teachers
Teacher Recruitment
Job Calendar
AP Politics
TDP Government
Education Sector

More Telugu News