కేఎల్ రాహుల్ అద్భుతమైన ఆటగాడు.. ఐపీఎల్ ట్రోఫీకి అతడు అర్హుడు: అంబటి రాయుడు!
- ఈ సీజన్లో రాహుల్ 593 పరుగులు
- నరైన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్
- రాహుల్‌కు ట్రోఫీ అందించాలన్న మాజీ క్రికెటర్
- ఢిల్లీ జట్టు ప్రదర్శనపై రాయుడు అసంతృప్తి
ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్లో రాహుల్ ఏ జట్టుకు ఆడినా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని కొనియాడాడు. ఈ సీజన్లో అద్భుతంగా రాణించిన రాహుల్.. ఐపీఎల్ ట్రోఫీ గెలవడానికి పూర్తి అర్హుడని అభిప్రాయపడ్డాడు.
ఢిల్లీ టీమ్‌లో అదరగొట్టాడు
ఐపీఎల్ 2026 సీజన్లో కేఎల్ రాహుల్ బ్యాట్‌తో దుమ్మురేపాడు. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 174.41 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 593 పరుగులు చేశాడు. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లోనే 60 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. అయితే రాహుల్ ఇంత బాగా రాణించినా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతోనే సరిపెట్టుకుంది.
సునీల్ నరైన్‌ను చితక్కొట్టాడు
కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్‌ను ఈ సీజన్లో రాహుల్ ఎదుర్కొన్నంత ధైర్యంగా ఎవరూ ఎదుర్కోలేదని రాయుడు అన్నాడు. నరైన్ బౌలింగ్‌లో రాహుల్ కొట్టిన స్ట్రెయిట్ షాట్లు ఈ సీజన్లోనే అత్యుత్తమమైనవని చెప్పాడు. ఐపీఎల్లో హేజిల్‌వుడ్, నరైన్ లాంటి పెద్ద పెద్ద బౌలర్లను టార్గెట్ చేయడం రాహుల్‌కు అలవాటని, ఢిల్లీ మేనేజ్మెంట్ అతడికి ఒక విన్నింగ్ టీమ్‌ను అందించి ట్రోఫీ గెలిపించాలని కోరాడు.
మిడిల్ ఓవర్లలో విధ్వంసం
ముంబై ఇండియన్స్ మాజీ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ కూడా రాహుల్ బ్యాటింగ్‌ను మెచ్చుకున్నాడు. కోల్‌కతా స్పిన్ ద్వయం నరైన్, వరుణ్ చక్రవర్తిలను మిడిల్ ఓవర్లలో రాహుల్ సమర్థంగా ఎదుర్కొని ఢిల్లీకి మంచి ఊపునిచ్చాడన్నాడు. పవర్‌ప్లే తర్వాత మిగతా జట్లను వణికించిన కోల్‌కతా స్పిన్నర్లపై రాహుల్ ఎదురుదాడికి దిగి వారి ప్రభావాన్ని తగ్గించాడని విశ్లేషించాడు.
ఢిల్లీ జట్టుపై రాయుడు అసంతృప్తి
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంపై రాయుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు. మిచెల్ స్టార్క్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి అనుభవజ్ఞులైన బౌలర్లు, డేవిడ్ మిల్లర్, కేఎల్ రాహుల్ లాంటి మ్యాచ్ విన్నర్లు ఉన్న ఢిల్లీ జట్టు టాప్-2లో ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. టీమ్‌లో మంచి ఆటగాళ్లు ఉన్నా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే వెనుకబడిపోతోందని ఇప్పటికైనా లోపాలను సరిదిద్దుకోవాలని సూచించాడు.