భారత్‌... అమెరికాకు కీలక భాగస్వామి: మార్కో రుబియో

National
Advertisement
  • రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడుతున్నాయని వ్యాఖ్య
  • భారత కంపెనీలు అమెరికాలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడి
  • భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో మోదీతో చర్చించినట్లు వెల్లడి
Advertisement
అమెరికాకు భారత్ కీలక భాగస్వామి అని అగ్రరాజ్య విదేశాంగ మంత్రి మార్కో రుబియో అన్నారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడుతున్నాయని తెలిపారు. భారతదేశానికి చెందిన కంపెనీలు తమ దేశంలో 20 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. భారత్‌కు ముడి చమురు సరఫరా చేయడానికి తమ దేశం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మార్కో రుబియో భారత్‌కు వచ్చారు. ఢిల్లీలోని సేవాతీర్థ్‌లో దాదాపు గంటసేపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

భద్రత, వాణిజ్యం, సాంకేతిక రంగాల్లో అమెరికా-భారత్ సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు మార్కో రుబియో తెలిపారు. ప్రధాని మోదీకి, ట్రంప్‌కు మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. వారిద్దరు కేవలం తాత్కాలిక ప్రయోజనాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారిస్తారని అన్నారు.

ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో ఆ దేశం గురించి కూడా మార్కో రుబియో ప్రస్తావించారు. ప్రపంచ ఇంధన మార్కెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Marco RubioIndia US relationsUS foreign policyNarendra ModiIndia investments USIndia oil supply

More Telugu News

ఢిల్లీలో లాలూతో సోనియా భేటీ.. ఆరోగ్యంపై ఆరా

03 Nov, 08:15

అచ్చం సినిమాలో జరిగినట్టే.. మత గురువును ఇరికించేందుకు పోలీసుల కుట్ర.. వీడియో ఇదిగో !

03 Nov, 08:13

మూడు వరల్డ్ కప్‌ల హీరో.. అంతర్జాతీయ క్రికెట్‌కు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వీడ్కోలు

03 Nov, 08:13

ఆడబిడ్డ ప్రాణంతో జగన్ రాజకీయం: ఎమ్మెల్యే గల్లా మాధవి

03 Nov, 07:46

తీరం దాటిన మురసు తుపాను.. తెల్లవారుజామున 3:30కు సీఎం చంద్రబాబు సమీక్ష

03 Nov, 07:43

ఉద్యమం చేసి బతుకు ఆగం చేసుకున్నా.. సూసైడ్ నోట్ రాసి తెలంగాణ ఉద్యమకారుడి బలవన్మరణం

03 Nov, 07:22

ఆ గెలుపు ఎప్పటికీ ప్రత్యేకం.. వరల్డ్ కప్ విజయాన్ని గుర్తుచేసుకున్న క్రీడాకారిణులు

03 Nov, 07:14

గేమింగ్ రంగంలోకి సూపర్ స్టార్.. షాట్‌గన్ గేమ్స్‌లో మహేశ్ బాబు పెట్టుబడి

03 Nov, 06:59

ఏపీ పురపోరు: 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.. సాయంత్రానికి ఫలితాలు

03 Nov, 06:40

హెచ్‌పీసీఎల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఉలిక్కిపడిన విశాఖ నగరం

03 Nov, 06:21

మురసు తుపాను ఎఫెక్ట్: సహాయక చర్యలకు రూ. 37 కోట్లు విడుదల

03 Nov, 06:19

ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఊరట.. రిటెన్షన్‌ గడువు నవంబర్ 17కి మార్పు

03 Nov, 06:16

'మురసు' తుపాను కల్లోలం.. ప్రకాశం జిల్లాలో హైఅలర్ట్!

02 Nov, 22:26

హైదరాబాద్ శివార్లలో అక్రమ బోర్లను టార్గెట్ చేసిన హైడ్రా

02 Nov, 22:13

గుడ్ న్యూస్.. రాప్తాడు బాలిక ఆరోగ్యంపై మంత్రి నారా లోకేశ్ అప్ డేట్

02 Nov, 22:05
..More Telugu News