విజయవాడలో థార్ జీపులతో హంగామా కేసు.. ఇద్దరికి రిమాండ్
- రెండు రోజుల క్రితం థార్ జీపులతో బీభత్సం సృష్టించిన యువకులు
- కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్
- 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు
విజయవాడలో థార్ జీపులతో సృష్టించిన హంగామా కేసులో ఏ1గా బొల్లా ఓం, ఏ2గా లింగమనేని రోహిత్‌ను పోలీసులు చేర్చారు. ఈ కేసులో ఇద్దరు యువకులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు నిందితులను రిమాండుకు తరలించారు.
రెండు రోజుల క్రితం ఈ యువకులు ఇద్దరు థార్ జీపులతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వారిద్దరు తమ థార్ జీపులతో నడిరోడ్డుపై ఢీకొట్టుకుంటూ వాహనదారులను భయాందోళనకు గురి చేశారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా, బొల్లా ఓం డ్రగ్స్ సేవించినట్లు తేలింది. మద్యం మత్తు వల్లే నిందితుడు రోడ్డుపై కార్ల ఢీకి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు.
అయితే నడిరోడ్డుపై ఈ హైడ్రామా సృష్టించింది ఒక యువతి కోసమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఒక అమ్మాయి కోసం వీరిద్దరు గొడవపడి ఒకరి జీపును మరొకరు ఢీకొట్టుకుంటూ గందరగోళం సృష్టించారు.