తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా

Akunuri Murali Resigns as Telangana Education Commission Chairman
  • పదవీకాలం నాలుగు నెలలు ఉండగానే రాజీనామా
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా అందజేత
  • అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
తెలంగాణ విద్యా కమిషన్ ఛైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం మరో నాలుగు నెలలు ఉంది. కానీ ఆయన ముందుగానే రాజీనామా చేయడం గమనార్హం. ఈ మేరకు ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాజీనామా పత్రాన్ని పంపించారు.

తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి చేశానని ఆయన తన రాజీనామా పత్రంలో పేర్కొన్నారు. తనకు అప్పగించిన బాధ్యత పూర్తి కావడంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో విద్యావ్యవస్థ బలోపేతం, సంస్కరణల కోసం ప్రభుత్వం విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసి, దానికి ఛైర్మన్‌గా ఆకునూరి మురళిని నియమించింది. అయితే పదవీ కాలం ముగియడానికి నాలుగు నెలల ముందుగానే ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడం గమనార్హం.
Go Back to Shorts
Akunuri Murali
Telangana Education Commission
Education Commission Chairman Resigns

More Telugu News