మొత్తం హెచ్‌ఆర్‌ విభాగాన్ని ఎత్తేసిన సీఈఓ.. కారణం ఇదే!

Bolt CEO scraps HR department cites creating problems
  • పడిపోయిన ఫిన్‌టెక్‌ కంపెనీ బోల్ట్‌ ఆదాయం
  • 30 శాతం ఉద్యోగులను తొలగించిన సీఈఓ
  • హెచ్‌ఆర్‌ విభాగంలో అందరినీ తీసేసిన వైనం
  • వాళ్లు లేని సమస్యల్ని సృష్టిస్తున్నారని ఆరోపణ
  • సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిందని విమర్శలు
అమెరికాకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీ ‘బోల్ట్’ సీఈఓ ర్యాన్ బ్రెస్లో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్‌ (హెచ్ఆర్ విభాగం) మొత్తాన్ని ఆయన ఉద్యోగాల నుంచి తొలగించారు. హెచ్‌ఆర్ టీమ్ అంతా కలిసి లేని సమస్యలను సృష్టిస్తోందని, వారిని తీసేసిన మరుక్షణమే ఆ సమస్యలన్నీ మాయమైపోయాయని ఆయన ప్రకటించడం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

కంపెనీ విలువ భారీగా పడిపోవడంతో రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా ఏప్రిల్‌లో 30 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు బ్రెస్లో తెలిపారు. ఫార్చ్యూన్ నిర్వహించిన ఒక సదస్సులో ఆయన మాట్లాడుతూ.. పెద్ద కంపెనీలకే హెచ్‌ఆర్ వ్యవస్థ సెట్ అవుతుందని, ఎదుగుతున్న తమలాంటి స్టార్టప్‌లకు పని పూర్తి చేయడంపై శ్రద్ధ పెట్టే టీమ్ మాత్రమే అవసరమని స్పష్టం చేశారు. కంపెనీలో పని చేయకుండా కేవలం సౌకర్యాలు కోరుకునే సంస్కృతి పెరిగిపోయిందని అందుకే వీరందరినీ తొలగించి వారానికి 4 రోజుల పని విధానాన్ని, అన్‌లిమిటెడ్ లీవ్స్ పాలసీలను రద్దు చేసినట్లు వెల్లడించారు.
Go Back to Shorts
Ryan Breslow
Bolt
HR department
Human Resources
Layoff
Restructuring
Fintech startup
Unlimited Leaves
Work culture
Employee benefits

More Telugu News