బండ్ల గణేష్ తో చాలా క్లోజ్ గా పవన్ కల్యాణ్... వీడియో వైరల్

Pawan Kalyan Bandla Ganesh affection at Chiranjeevi movie launch
  • చిరంజీవి కొత్త సినిమా వేడుకలో కలిసిన పవన్, బండ్ల గణేష్
  • బండ్ల గణేష్ భుజంపై ఆప్యాయంగా చేయి వేసి నడిచిన పవన్
  • వీరిద్దరి మధ్య దూరం పెరిగిందన్న ఊహాగానాలకు తెర
  • పవన్‌ను 'దేవుడు' అని పిలుచుకునే బండ్ల గణేష్
  • 'గబ్బర్ సింగ్'తో బండ్ల గణేష్‌ను స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టిన పవన్
తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటుడు-నిర్మాత బండ్ల గణేష్ మధ్య ఉన్న సాన్నిహిత్యం చాలా ప్రత్యేకమైనది. వీరిద్దరి మధ్య ఉన్న బంధం కేవలం ఒక హీరో, నిర్మాత లేదా తోటి నటుల పరిధికి అతీతమైనది. 

బండ్ల గణేష్‌కు పవన్ కల్యాణ్ అంటే కేవలం అభిమానం మాత్రమే కాదు, ఒక రకమైన 'భక్తి'. పవన్ కల్యాణ్‌ను ఆయన తన "దేవుడు" గా, తన జీవితాన్ని మార్చిన గురువుగా భావిస్తారు. సినిమా వేదికలపై బండ్ల గణేష్ ఇచ్చే స్పీచ్‌లు టాలీవుడ్‌లో ఫేమస్. పవన్ కల్యాణ్ గురించి ఆయన మాట్లాడే "ఈశ్వరా.. పరామేశ్వరా.. పవన్ కళ్యాణేశ్వరా" వంటి డైలాగులు, ఆయన చూపించే ఎమోషన్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్.

ఒక సాధారణ నటుడిగా ఉన్న తనను నమ్మి 'గబ్బర్ సింగ్' లాంటి భారీ ప్రాజెక్ట్‌ను అప్పగించి, తనను స్టార్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టింది పవన్ కల్యాణే అని బండ్ల గణేష్ ఎన్నో సందర్భాల్లో కృతజ్ఞతతో చెప్తారు. మధ్యలో కొన్ని వ్యక్తిగత లేదా రాజకీయ కారణాల వల్ల వీరి మధ్య స్వల్ప దూరం పెరిగినట్లు వార్తలు వచ్చినా, మెగా ఈవెంట్లలో వీరిద్దరూ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా మాట్లాడుకుంటూ తమ బంధం ఇప్పటికీ బలంగానే ఉందని నిరూపిస్తూ ఉంటారు. తాజాగా, బాబీ దర్శకత్వంలో చిరంజీవి కొత్త చిత్రం ఇవాళ ప్రారంభం కాగా... ఈ సినిమాకు పవన్ క్లాప్ కొట్టారు. ఈ వేడుకలో పవన్, బండ్ల గణేష్ తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం చూడొచ్చు. బండ్ల గణేష్ భుజం చుట్టూ పవన్ చేయి వేసి నడుస్తున్న వీడియోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


Go Back to Shorts
Bandla Ganesh
Pawan Kalyan
Telugu cinema
Gabbar Singh
Chiranjeevi
Tollywood
Movie producer
Celebrity friendship
Bobby Kolli
Mega event

More Telugu News