ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్.. ప్రధాని మోదీకి పార్లే థ్యాంక్స్

National
Advertisement
  • జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్ ఇచ్చిన మోదీ
  • సోషల్ మీడియాలో పంచుకున్న ఇటలీ ప్రధాని
  • ప్రపంచవేదికపైకి తీసుకువెళ్ళారంటూ పార్లే థ్యాంక్స్
Advertisement
తమ టొఫీని (చాక్లెట్) ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మెలోడీ తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కృతజ్ఞతలు తెలిపింది. ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చిన మెలోడీ చాక్లెట్ ప్యాకెట్‌ను ప్రదర్శిస్తూ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని 'ఎక్స్' చేసిన పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లే ప్రోడక్ట్స్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ప్రధానికి ధన్యవాదాలు తెలిపింది.

"పార్లే మెలోడీని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. భారతీయుల అభిమాన ఉత్పత్తి సరిహద్దులు దాటి పంచుకోవడాన్ని చూడటం మనందరికీ గర్వకారణం" అని పార్లే ప్రొడక్ట్స్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేసింది.

పార్లే ప్రొడక్ట్స్ ఈ వీడియోను "1983 నుండి సంబంధాలను తీయగా చేస్తున్నాం" అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా షేర్ చేసింది.

మెలోని షేర్ చేసిన క్లిప్‌లో, "ప్రధానమంత్రి మోదీ మాకు ఒక బహుమతి ఇచ్చారు. చాలా చాలా మంచి టాఫీని తెచ్చారు" అని ఆమె చెబుతుండగా, ఆ ఇద్దరు నాయకులు నవ్వుతూ కలిసి "మెలోడీ" అని అనడం వినబడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించి, వీక్షణలు మరియు ప్రజాదరణ పరంగా ఒక రికార్డు సృష్టించింది. కొన్ని గంటల్లోనే 10 కోట్ల వీక్షణలను దాటిందని సోషల్ మీడియా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement

సంబంధిత వార్తలు

Giorgia MeloniItaly Prime MinisterNarendra ModiParle ProductsMelody chocolateIndia Italy relations

More Telugu News

ఫ్లోరిడా విమాన ప్రమాదం: చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన, ప్రియుడికి కో-పైలట్ మెసేజ్!

03 Nov, 10:36

90 ఏళ్ల వయసులోనూ సిక్స్‌ప్యాక్‌ ఫిట్‌నెస్‌.. ఈ జపాన్‌ బాడీబిల్డర్‌ రహస్యాలివే!

03 Nov, 10:31

ఇక భువనేశ్వర్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

03 Nov, 10:29

భారత్-పాక్ మ్యాచ్: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. ఇదే అసలైన క్రేజ్!

03 Nov, 10:27

చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!

03 Nov, 10:15

జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు

03 Nov, 10:09

భారత్‌లో యాపిల్‌ రికార్డుల మోత.. ఐఫోన్‌ అమ్మకాల్లో కొత్త చరిత్ర!

03 Nov, 10:07

రాప్తాడు దాడి నిందితుడి కుడి కాలు తొలగింపు.. కొనసాగుతున్న చికిత్స

03 Nov, 09:52

త్రిపురలో బీఎస్ఎఫ్ జ‌వాన్ల‌పై కర్రలతో మూకదాడి.. ఆయుధం లాక్కునేందుకు యత్నం!

03 Nov, 09:49

ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్.. కూటమి దూకుడు

03 Nov, 09:46

టీమిండియాలోకి హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. కండిషన్ పెట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్

03 Nov, 09:45

ఖేష్మ ద్వీపంలో భారీ పేలుళ్లు.. హర్మూజ్‌ సమీపంలో ఏం జరుగుతోంది?

03 Nov, 09:39

సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్.. తుపాన్ల నష్టంపై ఆరా

03 Nov, 09:35

భార్యకు 20 ఏళ్లుగా నరకం.. భర్త ఫోన్‌లో 10 లక్షలకు పైగా అకృత్యాల ఫొటోలు, వీడియోలు!

03 Nov, 09:29

డిస్నీలోనూ లేఆఫ్స్‌.. వేలాది ఉద్యోగాల కోతకు సిద్ధమైన వినోద రంగ దిగ్గజం

03 Nov, 09:18
..More Telugu News