భాక్రా కాల్వలో పడిపోయిన వ్యాన్.. 26 ఏళ్ల తర్వాత వెలికితీత

National
Advertisement
  • పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఘటన
  • 32 అడుగుల లోతు ఉన్న భాక్రా కాలువలో 2000 సంవత్సరంలో పడిన వ్యాన్
  • మృతదేహం కోసం గాలిస్తుండగా కనిపించిన వాహనం
Advertisement
పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో, దాదాపు 26 ఏళ్ల క్రితం భాక్రా కెనాల్‌లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులతో నీటిలో పడిపోయిన ఒక వ్యాన్‌ను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. రెండు దశాబ్దాలకు పైగా 32 అడుగుల లోతు ఉన్న భాక్రా కాలువ అడుగున ఉన్న మారుతి ఓమ్ని వ్యాన్‌ను స్థానిక గజ ఈతగాడు కమల్‌ప్రీత్ సైని కనుగొన్నారు. వ్యాన్ ముందు భాగంలో కొన్ని మానవ అస్థిపంజర అవశేషాలు లభించాయని ఆయన తెలిపారు.

మృతురాలి చిన్నారికి చెందినదిగా భావిస్తున్న ఒక చొక్కాను కూడా స్వాధీనం చేసుకున్నామని, లభించిన వస్తువులన్నింటినీ ఆ కుటుంబానికి అప్పగించామని ఆయన చెప్పారు. 2000 సంవత్సరంలో కాలువలో పడిపోయిన ఆ వ్యాన్‌ను ఇప్పుడు బయటకు తీశారని ఒక పోలీసు అధికారి తెలిపారు. రూప్‌నగర్‌లోని కీరత్‌పూర్ సాహిబ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నక్కియన్ గ్రామం సమీపంలో ఒక మృతదేహం కోసం గాలిస్తుండగా సైనికి ఈ వాహనం కనిపించింది.

26 ఏళ్ల క్రితం నలుగురు కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా కాల్వలో పడి గల్లంతయ్యారు. వారిలో ఎనిమిదేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఆ సమయంలో వారి గురించి నెల రోజుల పాటు గాలించినప్పటికీ మృతదేహాలు, వాహనం ఆచూకీ లభ్యం కాలేదు.

తాను ఒక మృతదేహం కోసం వెతుకుతున్న సమయంలో కాలువలో ఈ వ్యాన్‌ను గుర్తించానని సైని తెలిపారు. ఇటీవల అదే కాల్వలో గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తుండగా ఈ వ్యాన్ లభ్యమైనట్లు తెలిపారు. వ్యాన్ పైకప్పు, వెనుక భాగం పూర్తిగా తుప్పుపట్టినట్లు చెప్పారు. కాల్వ అడుగు భాగాన ఉన్న వాహనం వెలికితీయడం సవాల్‌గా మారినప్పటికీ స్థానికులతో కలిసి ట్రాక్టర్ల సాయంతో తీసినట్లు చెప్పారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bhakra CanalPunjabRoopnagarMaruti OmniVan AccidentDrowningHuman RemainsKeeratpur Sahib Police

More Telugu News

ఏపీ కార్పొరేషన్ ఫలితాలు.. టీడీపీ, జనసేన హవా

03 Nov, 10:56

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. ట్రంప్ ప్రభుత్వ జాబితాలో చేర్చడంపై చర్చ

03 Nov, 10:54

ఎవరెస్ట్‌ సమీపంలో ఘోర ప్రమాదం.. ఢీకొన్న హెలికాప్టర్లు.. వీడియో ఇదిగో!

03 Nov, 10:51

ఇతరులకు ఇబ్బంది కాకూడదు.. సూపర్‌ మార్కెట్‌లో ఇలా ప్రవర్తించకండి!

03 Nov, 10:49

ఏపీ లిక్కర్ స్కామ్‌లో అంబటికి ఈడీ సమన్లు.. విచారణకు హాజరుకావాలని ఆదేశం

03 Nov, 10:47

భూమిపైకి జీవం అంతరిక్షం నుంచి రాలేదా? కొత్త అధ్యయనంలో ఆసక్తికర విషయాలు

03 Nov, 10:45

‘మెగా’ ఇంట్లో పెళ్లి బాజాలు​.. సాయి దుర్గా తేజ్ పెళ్లి ఫిక్స్?.. డిసెంబర్‌లో వివాహ ముహూర్తం?

03 Nov, 10:41

పులివెందులలో వైసీపీ పోలింగ్ ఏజెంట్లను తరిమికొట్టారు: సతీశ్ కుమార్ రెడ్డి

03 Nov, 10:38

ఫ్లోరిడా విమాన ప్రమాదం: చివరి క్షణాల్లో కెప్టెన్ ప్రార్థన, ప్రియుడికి కో-పైలట్ మెసేజ్!

03 Nov, 10:36

ఇక భువనేశ్వర్‌ కెరీర్‌ ముగిసినట్లేనా? అశ్విన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

03 Nov, 10:29

భారత్-పాక్ మ్యాచ్: 34 వేల సీట్లకు 84 లక్షల దరఖాస్తులు.. ఇదే అసలైన క్రేజ్!

03 Nov, 10:27

చలి వాతావరణంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ చిట్కాలు పాటించండి!

03 Nov, 10:15

జగన్‌పై కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు

03 Nov, 10:09

భారత్‌లో యాపిల్‌ రికార్డుల మోత.. ఐఫోన్‌ అమ్మకాల్లో కొత్త చరిత్ర!

03 Nov, 10:07

రాప్తాడు దాడి నిందితుడి కుడి కాలు తొలగింపు.. కొనసాగుతున్న చికిత్స

03 Nov, 09:52
..More Telugu News