నిజమైన సీనియర్ అంటే కోహ్లీనే: పీవీ సింధు ప్రశంసలు

PV Sindhu Praises Virat Kohli as True Senior
  • విరాట్ కోహ్లీపై ఇన్స్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టిన పీవీ సింధు
  • భారత క్రీడారంగంలో కోహ్లీ లాంటి నిజమైన సీనియర్ మరొకరు లేరన్న సింధు
  • "వెనక్కి తగ్గకు" అంటూ కోహ్లీ ఇచ్చిన సలహాను గుర్తు చేసుకున్న షట్లర్
  • బెంగళూరులో జరిగిన ఆర్సీబీ క్రీడా సదస్సులో ఇద్దరు దిగ్గజాల భేటీ
  • ఈ భేటీకి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్
భారత క్రీడారంగంలోని ఇద్దరు దిగ్గజాలు, క్రికెటర్ విరాట్ కోహ్లీ, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఒకే వేదికపై కలిశారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీపై సింధు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టారు. మంగళవారం బెంగళూరులో జరిగిన ‘ఆర్సీబీ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్’లో వీరిద్దరూ కలుసుకున్నారు.

"నాకు మార్గనిర్దేశం అవసరమైన ప్రతిసారీ, మీరు సరైన సలహాలు, మాటలతో నా పక్కన నిలిచారు. భారత క్రీడారంగంలో నిజమైన సీనియర్ ఎలా ఉండాలో చెప్పడానికి మీకంటే గొప్ప ఉదాహరణ లేదు. మీరు ఎంతో ఉదారంగా, వినయంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటారు. ఇతరులను ప్రోత్సహించడానికి ఎప్పుడూ ముందుంటారు. 'ఎప్పుడూ వెనక్కి తగ్గకు పీవీ' అని మీరు చెప్పిన మాటను నేను స్వీకరించాను. మీలాంటి వ్యక్తుల వల్లే భారత క్రీడారంగం మెరుగ్గా ఉంది" అని సింధు తన పోస్ట్‌లో పేర్కొంది. కోహ్లీతో దిగిన ఫొటోను కూడా ఆమె పంచుకోగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయింది.

గాయాల కారణంగా కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న సింధు, ప్రస్తుతం తిరిగి ఫామ్‌లోకి వస్తోంది. ఈ నెలలో జరిగిన థాయ్‌లాండ్ ఓపెన్‌లో ఆమె క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. మరోవైపు, కోహ్లీ ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై సెంచరీతో జట్టును గెలిపించాడు.

క్రీడాకారుల ప్రదర్శన, నాయకత్వ లక్షణాలు, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై చర్చించేందుకు ఆర్‌సీబీ ఈ సదస్సును నిర్వహించింది. ఇందులో కోహ్లీ కీలక వక్తగా పాల్గొని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే సింధు, కోహ్లీల భేటీ జరిగింది.
Go Back to Shorts
PV Sindhu
Virat Kohli
RCB Innovation Lab
Indian Sports Summit
Badminton
Cricket
Royal Challengers Bangalore
Sports
Thailand Open
Kolkata Knight Riders

More Telugu News