కన్య మౌనం వివాహానికి సమ్మతమే.. తాలిబన్ల కొత్త చట్టం
- ఆఫ్ఘనిస్థాన్‌లో వివాదాస్పద కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టిన తాలిబన్లు
- బాల్య వివాహాలు, విడాకులపై తండ్రి, తాతలకు విస్తృత అధికారాలు
- కొత్త చట్టంపై అంతర్జాతీయంగా, హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత
- మహిళల విద్య, ఉపాధిపై ఇప్పటికే ఉన్న ఆంక్షలకు ఈ చట్టం అదనం
ఆఫ్ఘనిస్థాన్‌లో అధికారంలో ఉన్న తాలిబన్ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దేశంలో వివాహం, విడాకులు, బాల్య వివాహాలు వంటి కీలక అంశాలను నియంత్రించేందుకు కొత్త కుటుంబ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఈ చట్టంలోని నిబంధనలు మహిళలు, బాలికల హక్కులను తీవ్రంగా కాలరాస్తున్నాయని, వారి భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెడుతున్నాయని మానవ హక్కుల సంఘాలు, అంతర్జాతీయ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్ఘన్ బ్రాడ్‌కాస్టర్ అము టీవీ కథనం ప్రకారం... "జీవిత భాగస్వాముల మధ్య విభజన సూత్రాలు" పేరుతో 31 ఆర్టికల్స్‌తో కూడిన ఈ నియమావళిని తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదించారు. దీనిని ఇటీవల ప్రభుత్వ అధికారిక గెజిట్‌లో ప్రచురించారు. ఈ చట్టంలో అత్యంత వివాదాస్పదంగా మారిన నిబంధన ఏమిటంటే, యుక్తవయసు వచ్చిన 'కన్య' అయిన బాలిక పెళ్లి ప్రతిపాదనకు మౌనంగా ఉంటే, దానిని ఆమె అంగీకారంగా పరిగణించవచ్చు. అయితే, ఇదే నిబంధన అబ్బాయిలకు లేదా గతంలో వివాహమైన మహిళలకు వర్తించదని స్పష్టం చేయడం గమనార్హం. ఇది బాలికల గొంతును నొక్కడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చట్టం బాల్య వివాహాల విషయంలో తండ్రులు, తాతలకు విస్తృత అధికారాలను కట్టబెట్టింది. సంరక్షకులు దుర్మార్గంగా ప్రవర్తించినా లేదా నైతికంగా సరిగ్గా లేరని నిరూపితమైతే తప్ప, వారు జరిపిన వివాహాలను రద్దు చేయడం కష్టం. బాల్యంలో వివాహం జరిగిన వారు యుక్తవయసు తర్వాత దానిని రద్దు కోరేందుకు అవకాశం ఉన్నప్పటికీ, తుది నిర్ణయం తాలిబన్ కోర్టుదే అవుతుంది. అంతేగాక భర్త చాలా కాలంగా కనిపించకుండా పోయినా, మత మార్పిడి, వ్యభిచారం ఆరోపణల వంటి కేసుల్లో జోక్యం చేసుకునే అధికారాన్ని తాలిబన్ న్యాయమూర్తులకు ఈ చట్టం కల్పించింది.
తాలిబన్ల కొత్త చట్టంతో మరింత ప్రమాదం
2021లో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు ఆఫ్ఘన్ మహిళలు, బాలికలపై కఠినమైన ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. మహిళల ఉన్నత విద్యపై నిషేధం, ఉపాధి అవకాశాల పరిమితి వంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తీసుకువచ్చిన ఈ కొత్త కుటుంబ చట్టం, ఆ ఆంక్షల పరంపరలో మరొకటిగా నిలుస్తోందని హక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
రాజకీయ వ్యాఖ్యాత ఫహీమా మహమ్మద్ మాట్లాడుతూ.. "బాల్య వివాహాలలో అర్థవంతమైన సమ్మతి అనేది ఉండదు. బాలిక మౌనాన్ని అంగీకారంగా పరిగణించడం ద్వారా వారి స్వయంప్రతిపత్తిని, గొంతును నొక్కినట్లే" అని హెచ్చరించారు. ఈ కొత్త చట్టం ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళల ప్రాథమిక హక్కులను మరింత ప్రమాదంలో పడేసిందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.