నీట్ పేపర్ లీక్ కేసు.. ఎవరీ మనీషా గురునాథ్? ఆమె పాత్రేంటి?
- నీట్ లీక్ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్ట్
- ఎన్టీఏ నిపుణురాలిగా ఉండటంతో చేతికి ప్రశ్నపత్రాలు
- నిందితురాలి ఇంట్లోనే రహస్యంగా క్లాసులు
- ఈ కేసులో ఇప్పటివరకు తొమ్మిది మంది అరెస్ట్
నీట్ యూజీ 2026 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వేగవంతం చేసింది. ఈ కేసులో పుణెకు చెందిన సీనియర్ బోటనీ టీచర్ మనీషా గురునాథ్ మాంధరేను శనివారం అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో దేశంలోని వివిధ నగరాల నుంచి ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు.
మనీషా మాంధరే పుణె శివాజీనగర్‌లోని ‘మోడ్రన్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్’లో పనిచేస్తున్నారు. జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ)లో సబ్జెక్ట్ నిపుణురాలిగా ఉన్నందున ఆమెకు బోటనీ, జువాలజీ ప్రశ్నపత్రాలను చూసే అవకాశం లభించింది. ఈ క్రమంలోనే మే 3న జరిగిన పరీక్షకు ముందే ఆమె ప్రశ్నలను లీక్ చేశారని సీబీఐ ఆరోపించింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆమె మరో నిందితురాలు మనీషా వాఘ్మారే సహాయంతో కొంతమంది నీట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. పుణెలోని తన ఇంట్లోనే విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ తరగతులు నిర్వహించారు. ఆ సమయంలో ముఖ్యమైన ప్రశ్నలను నోట్‌బుక్స్‌లో రాయించి, టెక్స్ట్‌బుక్స్‌లో మార్క్ చేయించినట్లు దర్యాప్తులో తేలింది.
ఆ ప్రత్యేక తరగతుల్లో చెప్పిన ప్రశ్నల్లో చాలావరకు నీట్ బయాలజీ పరీక్ష పేపర్‌తో సరిపోలాయి. ఈ వ్యవహారంలో ఎన్టీఏ అంతర్గత వ్యక్తులు, మధ్యవర్తులు పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ప్రశ్నలను చేరవేసినట్లు ఏజెన్సీ అనుమానిస్తోంది. కేంద్ర విద్యాశాఖ ఫిర్యాదు మేరకు మే 12న సీబీఐ ఈ కేసును నమోదు చేసింది.