ఐపీఎల్‌లో మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత
- టీ20 క్రికెట్‌లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్న సిరాజ్
- కేకేఆర్‌తో మ్యాచ్‌లో రహానెను ఔట్ చేసి రికార్డ్
- ఈ ఘనత సాధించిన 21వ భారత బౌలర్‌గా హైదరాబాదీ పేసర్
గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్, హైదరాబాదీ ఆటగాడు మహమ్మద్ సిరాజ్ తన కెరీర్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో జరిగిన మ్యాచ్‌లో టీ20 ఫార్మాట్‌లో 200 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ ఘనత సాధించాడు.
కేకేఆర్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్‌లో కెప్టెన్ అజింక్యా రహానెను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ విసిరిన అద్భుతమైన ఇన్‌స్వింగర్‌కు రహానె (14) డిఫెన్స్ ఛేదించుకుని బంతి వికెట్లను గిరాటేసింది. ఈ వికెట్‌తో టీ20ల్లో 200 వికెట్లు పడగొట్టిన 21వ భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. తన 174వ టీ20 మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్న సిరాజ్ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 121 మ్యాచ్‌లలో 123 వికెట్లు పడగొట్టాడు.
అయితే, సిరాజ్ వ్యక్తిగత రికార్డు సాధించిన ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లు మాత్రం పూర్తిగా తేలిపోయారు. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (93) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 35 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో గుజరాత్ బౌలింగ్‌ను తుత్తునియలు చేశాడు. అతడికి అండగా అంగ్‌క్రిష్ రఘువంశీ (82 నాటౌట్), కామెరాన్ గ్రీన్ (52 నాటౌట్) మెరుపు అర్ధశతకాలతో రాణించారు.
గుజరాత్ ఫీల్డర్లు రెండుసార్లు క్యాచ్‌లు వదిలిపెట్టడంతో అలెన్ మరింత రెచ్చిపోయాడు. రహానె ఔటయ్యాక, అలెన్-రఘువంశీ రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించగా, ఆ తర్వాత రఘువంశీ-గ్రీన్ అజేయంగా మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి కేకేఆర్‌కు భారీ స్కోరును అందించారు.