సుంకం పెంపు తర్వాత.. వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు
- వెండి దిగుమతులను స్వేచ్ఛా దిగుమతి విధానం నుంచి పరిమిత విధానానికి సవరింపు
- ఆంక్షల విభాగంలోని వస్తువుల దిగుమతికి ప్రభుత్వ లైసెన్స్ తప్పనిసరి
- బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 15 శాతానికి పెంచిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై కొత్త ఆంక్షలు విధించింది. అమెరికా, ఇరాన్ యుద్ధం వేళ, బంగారం, వెండి దిగుమతులపై కేంద్రం సుంకాన్ని పెంచిన విషయం తెలిసిందే. తాజాగా, ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. వెండి దిగుమతులపై తాజాగా మరిన్ని ఆంక్షలు విధించింది. వెండి దిగుమతులను స్వేచ్ఛా దిగుమతి విధానం నుంచి పరిమిత విధానానికి సవరించింది.
తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య విభాగ డైరెక్టర్ జనరల్ ఓ నోటిఫికేషన్లో తెలిపింది. ఆంక్షల విభాగంలో ఉండే వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.
విదేశీ మారకపు ద్రవ్యాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు, బంగారం కొనడాన్ని ఏడాదిపాటు సాధ్యమైనంత తగ్గించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బంగారం, వెండి దిగుమతులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది.