పోక్సో కేసు: బండి భగీరథ్‌కు సిట్ నోటీసులు
- మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణల కేసు
- రేపు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని నోటీసులు
- కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం
బండి భగీరథ్ కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. కేసు విచారణ పారదర్శకంగా జరగాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసు సిట్ విచారిస్తోంది. బండి భగీరథ్‌పై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. మరోవైపు, తనను హనీట్రాప్ చేశారని బండి భగీరథ్ కరీంనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.