ఏటీఎంలో సెలూన్ షాప్.. ఎక్కడో తెలుసా?

SBI ATM Transformed into Salon in Danapur Bihar
  • బీహార్‌లో ఎస్బీఐ ఏటీఎం బోర్డుతో నడుస్తున్న సెలూన్
  • డబ్బుల కోసం వెళ్లినవారికి కటింగ్, షేవింగ్ సేవలు
  • ఖాళీ అయిన ఏటీఎం స్థలంలోనే సెలూన్ ఏర్పాటు
  • వీడియో వైరల్ కావడంతో ఎస్బీఐ బోర్డు తొలగింపు
  • నెట్టింట నవ్వులు పూయిస్తున్న 'సెలూన్ ఏటీఎం'
బీహార్‌లోని దానాపూర్‌లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లే ఓ ఎస్బీఐ ఏటీఎం, ఇప్పుడు హెయిర్‌కట్, షేవింగ్ చేసే సెలూన్‌గా మారిపోయింది. బయట నుంచి చూస్తే అచ్చం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలాగే కనిపించడంతో లోపలికి వెళ్లిన వారు షాక్ అవుతున్నారు. ఈ విచిత్రమైన 'సెలూన్ ఏటీఎం'కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దానాపూర్‌లోని రూపస్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఈ ఏటీఎం కియోస్క్ వద్ద కొన్నేళ్ల పాటు ఎస్బీఐ ఏటీఎం పనిచేసేది. కొన్ని నెలల క్రితం బ్యాంకు ఆ ఏటీఎంను అక్కడి నుంచి తొలగించింది. అయితే, ఏటీఎం ఖాళీ అయినా బయట ఉన్న ఎస్బీఐ బోర్డు, లోగో వంటి గుర్తులను మాత్రం అలాగే వదిలేశారు. ఆ తర్వాత ఆ ఖాళీ స్థలాన్ని ఓ సెలూన్ యజమాని అద్దెకు తీసుకున్నారు.

బయట ఏటీఎం బోర్డు ఉండటంతో డబ్బుల కోసం చాలామంది లోపలికి వెళ్తున్నారు. తీరా అక్కడ ఏటీఎం మెషీన్‌కు బదులుగా సెలూన్ కుర్చీలు, అద్దాలు, కటింగ్ పరికరాలు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఈ ఘటనపై వీడియో వైరల్ కావడంతో అధికారులు వెంటనే స్పందించి ఎస్బీఐ బోర్డు, లోగోను తొలగించారు.

ఈ విషయంపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. "డబ్బులు విత్‌డ్రా చేయడానికి వెళ్తే, హెయిర్‌కట్‌తో బయటకు వస్తున్నారు" అంటూ కొందరు కామెంట్ చేశారు. ఇది అసలైన భారతీయ 'జుగాడ్' అని మరికొందరు అభిప్రాయపడ్డారు. పాత గుర్తులను తొలగించకుండా కొత్త వ్యాపారాలు చేయడం ఇక్కడ సాధారణమేనని మ‌రికొంద‌రు చమత్కరించారు.
SBI ATM
Danapur
Bihar
Salon
ATM Salon
Viral Video
State Bank of India
Rupaspur

More Telugu News