ఇది కోటి రూపాయల బైక్.. ముంబైలో మొదటి డెలివరీ
- భారత్ లో డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని స్పెషల్ ఎడిషన్ బైక్
- లిమిటెడ్ ఎడిషన్ బైక్ కోసం బుకింగ్స్ పూర్తయినట్లు వెల్లడించిన డుకాటీ
- ప్రపంచవ్యాప్తంగా 630 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి
- బైక్ బరువు తగ్గడం కోసం కార్బన్ ఫైబర్ వినియోగం
ఇటాలియన్ మోటార్ సైకిల్ తయారీ సంస్థ డుకాటీ అత్యంత ప్రీమియం, పరిమిత ఎడిషన్ బైక్ 'డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని'ని తీసుకువచ్చింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1 కోటి. ఈ లిమిటెడ్ ఎడిషన్ సూపర్ బైక్ కోసం ఇప్పటికే బుకింగ్స్ పూర్తయినట్లు డుకాటీ తెలిపింది. మొదటి మోటార్ సైకిల్‌ను ముంబైలో డెలివరీ చేసినట్లు వెల్లడించింది.
పనిగేల్ వీ4 లంబోర్గిని బైక్‌లను ప్రపంచవ్యాప్తంగా 630 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తారు. భారత్‌కు వచ్చిన అత్యంత అరుదైన మోటార్ సైకిళ్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది. డుకాటీ మరింత ప్రత్యేకమైన 'స్పెషాలీ క్లయింటి' ఎడిషన్‌ను కూడా తయారు చేస్తోంది. వీటిని ప్రపంచవ్యాప్తంగా 63 యూనిట్లను మాత్రమే తయారు చేస్తోంది. ప్రత్యేకంగా లంబోర్గిని కార్ల యజమానుల కోసం వీటిని తయారు చేస్తుండగా, యజమానులు తమ కార్ల రంగుల్లోనే బైక్‌ను కూడా కాన్ఫిగర్ చేసుకునే వెసులుబాటు ఉంది.
డుకాటీ పనిగేల్ వీ4 ఎస్, లంబోర్గిని రెవుయెల్టో స్పూర్తితో పఃనిగేల్ వీ4ను తీర్చిదిద్దారు. డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వీ4 లంబోర్గిని, డయావెల్ 1260 లంబోర్గిని తర్వాత, డుకాటీ, లంబోర్గిని కలిసి తీసుకువచ్చిన మూడో బైక్ డుకాటీ పనిగేల్ వీ4 లంబోర్గిని. ఈ మోటార్ సైకిల్‌ను డుకాటీ సెంట్రో స్టైల్ మరియు లంబోర్గిని సెట్రో స్టైల్ డిజైన్ బృందాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఈ బైక్‌లో ఎక్స్పోజ్డ్ కార్బన్ ఫైబర్‌తో పాటు వెర్డే స్కాండల్, గ్రిజియో టెలెస్టో, గ్రిజియో అచెసో యాక్సెంట్లు ఉంటాయి. ఫోర్డ్స్ అల్యూమినియం వీల్స్, రీడిజైన్ చేయబడిన టెయిల్ సెక్షన్, వింగ్లెట్లు అన్నీ లంబోర్గిని ఫ్లాగ్షిప్ హైబ్రిడ్ సూపర్‌కార్ డిజైన్ లాంగ్వేజ్‌ను ప్రతిబింబించేలా రూపొందించినట్లు డుకాటీ చెబుతోంది.
ముఖ్యంగా బైక్ బరువు తగ్గడానికి, ప్రత్యేకత కోసం విస్తృతంగా కార్బన్ ఫైబర్ ఉపయోగించారు. ఫెయిరింగ్, మడ్ గార్డ్స్, హీల్ గార్డ్స్, చైనా గార్డ్, ఎగ్జాస్ట్ ప్రొటెక్షన్, ట్యాంక్ ప్రొటెక్షన్, రేడియేటర్ డక్ట్ వంటి భాగాలన్నీ కార్బన్ పైబర్‌తో తయారు చేసినట్లు తెలిపింది.
ఈ బైక్‌కు 1,103సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల్ V4 ఇంజన్‌ను అమర్చారు. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్సు, స్లిప్పర్ డ్రై క్లచ్‌లను ఏర్పాటు చేశారు. పనిగేల్ వీ4 లంబోర్గిని బైక్ బరువు 185 కిలోలు ఉంటుంది. పనిగేల్ సిరీస్ లో వచ్చిన అత్యంత తేలికైన మరియు అత్యంత పవర్‌పుల్ బైక్ ఇది.