అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది!
- ప్రైమ్ మెంబర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు
- స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు
- రూ. 99,999కే Samsung Galaxy S25 Ultra 5G
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2026 ప్రారంభమైంది. ప్రైమ్ మెంబర్ల కోసం ముందే అందుబాటులోకి వచ్చిన ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ వినియోగదారులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ (గరిష్టంగా రూ. 9,500 వరకు) అదనపు ప్రయోజనంగా ఉంది.
ఈ సేల్‌లో లభిస్తున్న కొన్ని బెస్ట్ టెక్ డీల్స్ వివరాలు:
శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 5జీ ధర భారీగా తగ్గింది. రూ. 1,29,999 ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు రూ. 99,999 కే లభిస్తోంది. దీనికి తోడు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ. 70,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అలాగే రూ. 2,000 విలువైన కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. బడ్జెట్ ఫోన్ చూస్తున్న వారి కోసం రెడ్ మీ ఏ7 ప్రొ 5జీ రూ. 11,999 (రూ. 15,999)కే లభిస్తోంది. ఇందులో 6.9 ఇంచుల డిస్ప్లే, 6,300mAh భారీ బ్యాటరీ ప్రధాన ఆకర్షణలు.
ఆపిల్ ఐప్యాడ్ ప్రియుల కోసం ఆపిల్ ఐపాడ్ 11-అంగుళాల (ఏ16 చిప్) మోడల్ రూ. 32,900 ధర వద్ద సేల్‌లో ఉంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధరను రూ. 31,150 వరకు తగ్గించుకోవచ్చు. ఇక లాప్‌టాప్ విభాగంలో ఆసస్ వివోబుక్ 15 (13th జెన్ ఇంటెల్ కోర్ ఐ5, 16జీబీ ర్యామ్) రూ. 59,990 కే లభిస్తోంది. పాత లాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే మరో రూ. 8,850 వరకు ఆదా చేయవచ్చు.
ఇటీవలే లాంచ్ అయిన శాంసంగ్ 43-అంగుళాల క్రిస్టల్ యూహెచ్ డీ 4కే విజన్ ఏఐ స్మార్ట్ టీవీపై అమెజాన్ రూ. 2,000 ఫ్లాట్ డిస్కౌంట్ ఇస్తోంది. ప్రొడక్ట్ పేజీలోని కూపన్‌ను ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందవచ్చు. దీనికి అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ల ద్వారా మరో రూ. 1,750 వరకు తగ్గించుకునే వెసులుబాటు ఉంది.