డ్రైవర్ ప్రవర్తనతో భయపడి వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకేసిన మహిళ.. వీడియో ఇదిగో!
- మలేషియాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఘటన
- వేగంగా వెళ్తున్న కారు నుంచి దూకడంతో మహిళకు గాయాలు
- డ్రైవర్ తనను అనుమానాస్పదంగా చూస్తున్నాడని ఆరోపణ
- ట్రిప్ రద్దు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్
మలేషియాలో ఓ మహిళ కదులుతున్న ట్యాక్సీలో నుంచి రద్దీగా ఉండే హైవేపైకి దూకేసింది. ట్యాక్సీ డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం రావడంతో, తనకేదో ప్రమాదం జరగబోతోందనే భయంతో ఆమె ఈ సాహసానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నార్త్ క్లాంగ్ జిల్లా పోలీసుల కథనం ప్రకారం మే 1వ తేదీ ఉదయం ఈ సంఘటన జరిగింది. ట్యాక్సీలో ప్రయాణిస్తున్న సమయంలో 47 ఏళ్ల డ్రైవర్ తనను రియర్ వ్యూ మిర్రర్ నుంచి పదేపదే అనుమానాస్పదంగా చూస్తున్నాడని మహిళ ఆందోళన చెందింది. భయాందోళనతో ఆమె కదులుతున్న వాహనం డోర్ తెరిచి రోడ్డుపైకి దూకేసింది. ఈ క్రమంలో ఆమె ఫోన్, చెప్పులు వంటి వస్తువులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వెనుక వస్తున్న వాహనదారులు అప్రమత్తమై వెంటనే బ్రేకులు వేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళ కిందకు దూకగానే డ్రైవర్ వెంటనే ట్యాక్సీని ఆపి, ట్రిప్ రద్దు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరోవైపు, అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడు గాయపడిన మహిళను సమీపంలోని క్లినిక్‌కు తరలించి సహాయం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా మహిళ ఆచూకీ కోసం గాలిస్తున్నామని, డ్రైవర్ తప్పు చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.