విజయ్‌కి ఫోన్ చేసి అభినందనలు తెలియజేశా: రాహుల్ గాంధీ ట్వీట్

  • టీవీకే పార్టీ అద్భుత విజయం సాధించిందన్న రాహుల్ గాంధీ
  • ప్రస్తుతం యువగళం పెరుగుతోందని వ్యాఖ్య
  • ప్రజా సమస్యలపై పోరాటం కాంగ్రెస్ కొనసాగిస్తుందన్న రాహుల్ గాంధీ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన టీవీకే పార్టీ అధినేత విజయ్‌కు లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. టీవీకే పార్టీ అధినేత విజయ్‌తో మాట్లాడానని, పార్టీ సాధించిన అద్భుతమైన ఫలితానికి ఆయనను అభినందించానని పేర్కొన్నారు.

ప్రస్తుతం యువగళం పెరుగుతోందనడానికి ఈ ఎన్నికల ఫలితాలు నిదర్శనమని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. తమిళనాడు, పుదుచ్చేరి ప్రజల కోసం పార్టీ పని చేస్తుందని హామీ ఇచ్చారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 100కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే 70కి పైగా, అన్నాడీఎంకే 50కి పైగా స్థానాలతో సరిపెట్టుకున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాలలో బీజేపీ, మిత్రపక్షాలు విజయం సాధించాయి. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారం చేజిక్కించుకుంది.

Vijay TVK
Rahul Gandhi
Tamil Nadu Elections
TVK Party
Congress Party
Puducherry
Indian Elections 2024

More Telugu News