సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా సుదీర్ఘ అనుభవం.. కానీ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్‌లో వర్క్

Technology
Advertisement
  • ఏఐ దెబ్బకు ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయినట్లు వెల్లడి
  • అందరినీ తొలగించి ఇద్దరు ఏఐ నిపుణులను కంపెనీ నియమించుకుందని వెల్లడి
  • కుటుంబపోషణ కోసం మెక్‌డొనాల్డ్‌లో చేరానన్న నెటిజన్
Advertisement
'ఏఐ' కారణంగా ఉద్యోగం కోల్పోయి, కుటుంబ పోషణ కోసం తాను మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్నానని 18 సంవత్సరాల అనుభవం కలిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ 'రెడ్డిట్' వేదికగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. 18 సంవత్సరాల పాటు తాను సాఫ్ట్‌వేర్ డెవలపర్‌గా పనిచేశానని, ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం కోల్పోయానని పేర్కొన్నాడు. నాటి నుంచి తాను 100కు పైగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఉద్యోగం రాలేదని తెలిపాడు.

అద్దె చెల్లించడానికి, కుటుంబ పోషణ కోసం తాను మెక్‌డొనాల్డ్స్‌లో పని చేస్తున్నానని పేర్కొన్నాడు. తాను పనిచేసిన కంపెనీలో ఉద్యోగం కోల్పోయింది తాను ఒక్కడినే కాదని చెప్పాడు. తమ బృందంలో 12 మంది ఉద్యోగులం ఉండేవాళ్లమని, అందరినీ తొలగించి కేవలం ఇద్దరు ఏఐ నిపుణులను మాత్రమే ఆ కంపెనీ నియమించుకుందని వెల్లడించాడు.

తనకు తెలిసిన ఎంతోమంది అనుభవజ్ఞులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పరిస్థితి కూడా ఇదేనని ఆ పోస్టులో ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న సుమారు 200 మంది డెవలపర్లు తనకు తెలుసునని చెప్పాడు. కుటుంబ బాధ్యతల కారణంగా ఎంతోమంది సంబంధం లేని ఉద్యోగాల్లో చేరుతున్నారని చెప్పాడు.
Advertisement

సంబంధిత వార్తలు

Software EngineerAI Job LossMcDonaldsLayoffSoftware DeveloperJob SearchRedittEmployment

More Telugu News

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10

కంగ్రాట్స్ చంద్రబాబు టీమ్!: జగన్

03 Nov, 19:31

అన్ని అపోహలు పటాపంచలు.. సౌర తుపానుల గుట్టు విప్పిన ఆదిత్య-ఎల్1

03 Nov, 19:14
..More Telugu News