తెలంగాణ సచివాలయంలో నకిలీ పోలీస్ హల్‌చల్.. సీఎంను కల్పిస్తానంటూ వీడియోలు!

Telangana
Advertisement
  • సచివాలయంలో నకిలీ పోలీస్ దుస్తులతో ఓ వ్యక్తి హల్‌చల్
  • సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానంటూ సోషల్ మీడియాలో వీడియోలు
  • వీడియోలు వైరల్ కావడంతో నిందితుడి కోసం పోలీసుల గాలింపు
  • నిందితుడిపై ఏపీలోనూ పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు గుర్తింపు
Advertisement
తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం మరోసారి బట్టబయలైంది. నిఖిల్ అనే వ్యక్తి పోలీస్ అధికారిగా నటిస్తూ, ఏకంగా సచివాలయంలోకి ప్రవేశించి వీడియోలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానని చెబుతూ అతను చిత్రీకరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిఖిల్ అసలు పోలీసే కాదని, సోషల్ మీడియా రీల్స్ కోసం పాతబస్తీలో పోలీస్ యూనిఫాం కొనుగోలు చేసి ఈ మోసానికి పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమై నిఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిపై ఆంధ్రప్రదేశ్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం.

ఈ ఘటనతో సచివాలయ భద్రతా వ్యవస్థ, నిఘా వర్గాల పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత పటిష్ఠమైన భద్రత ఉండాల్సిన ప్రదేశంలో నకిలీ వ్యక్తి వీడియోలు తీసేంత వరకు గుర్తించకపోవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా నకిలీ గుర్తింపు కార్డులతో డజనుకు పైగా వ్యక్తులు సచివాలయంలోకి ప్రవేశించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం పోలీసులు నిఖిల్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Viral VideoFake PoliceTelangana SecretariatTelangana

More Telugu News

డ్రైవర్ అప్రమత్తత... పెను ప్రమాదం నుంచి బయటపడ్డ విద్యార్థులు

04 Nov, 06:21

కడప, విజయనగరం కార్పొరేషన్లు టీడీపీ కైవసం.. కూటమి క్లీన్ స్వీప్

04 Nov, 06:17

ఏపీ పుర పోరు: కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై కూటమి జెండాల రెపరెపలు

03 Nov, 23:53

కూటమి పాలనకు ప్రజల పట్టం.. ఇది అమూల్యమైన తీర్పు: పవన్ కల్యాణ్

03 Nov, 23:09

హైదరాబాద్‌లో భారీ ఫేక్ కరెన్సీ రాకెట్.. రూ.6.78 కోట్ల నకిలీ నోట్ల పట్టివేత

03 Nov, 22:55

'ఓం' మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. శ్రీలీల క్యారెక్టర్ ఇదే!

03 Nov, 22:49

రాహుల్ గాంధీ నిద్రపోతున్న పోస్టర్లు.. కోల్‌కతా సాల్ట్ లేక్ లో కలకలం!

03 Nov, 22:41

విశాఖ మేయర్ పీఠం టీడీపీ కూటమి కైవసం.. వరుదు కల్యాణిపై భారీ ఆధిక్యంతో ముక్కా శ్రావణి విజయం

03 Nov, 21:47

ఏసీబీ వలలో మెప్మా ఏడీ.. ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, ఆస్తిపత్రాలు గుర్తింపు

03 Nov, 21:28

టీమిండియాకు గుడ్ న్యూస్.. ఫిట్‌నెస్ నిరూపించుకుని న్యూజిలాండ్ బయల్దేరిన ప్రసిద్ధ్ కృష్ణ

03 Nov, 21:13

ఇది సంబరాలకు కాదు, సేవకు సమయం: పురపాలిక తీర్పుపై నారా లోకేశ్

03 Nov, 20:49

కడప జిల్లాలో 4 మున్సిపాలిటీలు టీడీపీ కైవసం.. బీజేపీ ఖాతాలో ఒకటి!

03 Nov, 20:41

మురసు తుపాను ఎఫెక్ట్.. చిలకలూరిపేట హైవేపై వరద నీరు, విజయవాడలో ఎడతెరిపిలేని వాన

03 Nov, 20:27

రష్మిక హిందీ యాసపై విమర్శలు.. అండగా నిలిచిన బాలీవుడ్ నటి

03 Nov, 20:16

జగన్ పాలనను జనం మర్చిపోలేదు.. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా తీర్పు కూటమికే: పల్లా శ్రీనివాసరావు

03 Nov, 20:10
..More Telugu News